భారత క్రికెట్లో ‘ఒకేఒక్కడు’
ముంబై, డిసెంబర్2: భారత క్రికెట్ క్రీడపై మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ ఎనలేని ప్రభావం వేశాడు. సచిన్ టెండూల్కర్ అంతర్జాతీయ టెస్ట్ మ్యాచులలోకి అడుగు పెట్టిన తర్వాత 87 మంది వచ్చారు. వెళ్లిపోయారు. గత 23 ఏళ్లుగా సచిన్ టెండూల్కర్ మాత్రం మొక్కవోకుండా నిలిచి ఉన్నాడు. భారత్ టెస్ట్ క్రికెట్‌లో అడుగుపెట్టిన ఆటగాళ్లలో సచిన్ టెండూల్కర్ 187వ వాడు. పాకిస్థాన్‌తో కరాచీలో జరిగిన మ్యాచ్‌లో 1989లో టెస్ట్ క్రికెట్‌లో టెండూల్కర్ అడుగుపెట్టాడు. తన ముంబై జట్టు సభ్యుడు సలీల్ అంకోలాతో పాటు సచిన్ టెండూల్కర్ అడుగు పెట్టాడు. తన ముంబై జట్టు సభ్యుడు సలీల్ అంకోలాతో పాటు సచిన్ టెండూల్కర్ టెస్ట్ మ్యాచుల్లోకి ప్రవేశించాడు. అంకోలా 186వ క్రీడాకా రుడిగా ప్రవేశిస్తే 187వ వాడు. టెస్ట్ మ్యాచుల్లోకి ప్రవేశించిన తాజా క్రికెటర్ వినయ్‌కుమార్. అతను టెస్ట్ మ్యాచుల్లో అడుగుపెట్టిన 274వ క్రికెటర్. ఆస్ట్రేలియాతో ఈ ఏడాది ప్రారంభంలో జరిగిన మ్యాచ్‌లో అతను తన అరంగేట్రం చేశాడు. సచిన్ టెండూల్కర్ ఆడిన మొదటి టెస్ట్‌తో కలుపుకుంటే ఇప్పటి వరకు 209 టెస్టులను భారత్ ఆడింది. టెండూల్కర్ 192 మ్యాచులు ఆడాడు. కేవలం 17 మ్యాచుల్లో మాత్రమే అతను ఆడలేదు. వీటిలో భారత్ 72 గెలవగా, 59 మ్యాచులు ఓడింది. 78 మ్యాచ్‌లు డ్రాగా ముగిశాయి. ఈ గెలిచిన 72 మ్యాచ్‌ల్లో 66 మ్యాచులు టెండుల్కర్ ఆడాడు. సచిన్ టెండుల్కర్ తర్వాత టెస్టు క్రికెట్లో ప్రవేశించిన క్రీడాకారుల్లో 60 శాతం మంది తప్పుకున్నారని అనిల్‌కుంబ్లే ది వీక్‌కు రాసిన కాల మ్‌లో అన్నాడు. అత్యున్నతమైన క్రికెట్‌లో ఇంత కాలం సుదీర్ఘకాలం ఆడడాన్ని బట్టే సచిన్ టెండు ల్కర్ స్థాయి ఏమిటో ఈ లెక్కలే చెబుతాయి. ఆట తీరు బాగా లేదని సెలెక్టర్లు సచిన్ టెండుల్కర్‌ను తప్పించిన ఒక్క సంఘటన కూడా లేదు. ఫిట్‌నెస్ కారణంగా సచిన్ టెండుల్కర్ కొన్ని టెస్టు మ్యాచు లు ఆడలేదు విశ్రాంతి తీసుకున్నాడు. ఇప్టటివరకు సెలక్టర్లు ఏ క్రికెటర్ ఎవరౌనా ఉన్నారంటే సచిన్ టెండుల్కర్ ఒక్కడే. రిటైర్ కావాలనే ఒత్తిడి పెరుగుతున్న ప్పటికీ సెలెక్టర్లు సచిన్ టెండుల్కర్‌ను తప్పించడం లేదు. 39 ఏళ్ల టెండుల్కర్ 23 ఏళ్ల కెరీర్‌లో 50 మంది బిన్నమైన భారత ఆటగాళ్లతో కలిసి ఆడాడు. ఆస్ట్రేలియా క్రికెటర్ రికీపాంటింగ్ తన 17 ఏళ్ల కెరీర్‌లో 82 మంది భిన్నమైన ఆటగాళ్లతో కలిసి ఆడాడు. ఏమైనా సచిన్ టెండుల్కర్ భారత క్రికెర్లలో శిఖరప్రాయుడే.