భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పై అనుచిత వ్యాఖ్యలు ఖండిస్తూ కాంగ్రెస్ నాయకుల దిష్టిబొమ్మ దహణం.
జనగామ (జనం సాక్షి ) జూలై28:భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పై అనుచిత వ్యాఖ్యలు చేసిన కాంగ్రెస్ లోక్ సభ నాయకుడు అదిర్ రంజన్ చౌదరి వైఖరి ఖండిస్తూ తక్షణమే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తూ గిరిజన మోర్చా జిల్లా అధ్యక్షులు బానోత్ రామకోటి నాయక్ ఆధ్వర్యంలో జనగామ పట్టణంలోని చౌరస్తాలో ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ మరియు పార్లమెంటరీ కాంగ్రెస్ పక్షనేత అదిర్ రంజన్ చౌదరి దిష్టిబొమ్మ దహణం చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఉడుగుల రమేష్ రాష్ట్ర గిరిజన మోర్చా ఉపాధ్యక్షులు దేవరాయ ఎల్లయ్య ముఖ్య అతిధులుగా పాల్గొనడం జరిగింది ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేశ రాష్ట్రపతిగా ఎన్డీఏ పక్షాలు ఒక సామాన్య గిరిజన మహిళను రాష్ట్రపతిగా నియమించడం కాంగ్రెస్ పార్టీకి మింగుడు పడడం లేదని ఒక గిరిజన మహిళ అని కూడా చూడకుండా పార్లమెంటరీ కాంగ్రెస్ ప్రతిపక్ష నేత ఆదిర్రంజన్ చౌదరి చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తూ వెంటనే క్షమాపణ చెప్పాలని లేనియెడల రాబోవు కాలంలో కాంగ్రెస్ పార్టీకి ప్రజలు తగిన రీతిలో బుద్ధి చెప్తారని వారు అన్నారు .ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి శోభనబోయిన శివరాజ్ యాదవ్, జిల్లా ప్రచార కార్యదర్శి పెద్దోజు జగదీష్ పట్టణ ప్రధాన కార్యదర్శి సంపత్ కుమార్, తిరుపతి మధు, కొంతం శ్రీనివాస్, గోడుమల అశోక్ , సానబోయిన మహిపాల్, ఆకుల క్రాంతి కుమార్, కోట వినోద్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.