భారీ వర్షాలకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

కోడేరు (జనం సాక్షి) జూలై 11  జిల్లా కొల్లాపూర్ నియోజక వర్గం కోడేరు మండల పరిధిలోని అన్ని గ్రామాల ప్రజలు ఈ మూడు రోజులు భారీ వర్షాలు కురుస్తాయి అన్న వాతావరణ సమాచారం ఉన్నందున ఈ మూడు రోజులు పాత మిద్దెలు కూలే ప్రమాదం ఉంది కాబట్టి ప్రత్యామ్నాయ మార్గం చూసుకొని కూలిపోయే మిద్దెలకు దూరంగా ప్రజలు ఉండాలని అదేవిధంగా తడిసిన కరెంటు స్తంభాలు గాని కరెంటు పరికరాలకు ప్రజలు దూరంగా ఉండాలని వీటిపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోడేరు ఎంపీపీ కొండ రాధా సుధాకర్ రెడ్డి ప్రజలకు విజ్ఞప్తి చేశారు. అదేవిధంగా సీజన్ వ్యాధుల పట్ల తగు జాగ్రత్తలు తీసుకోవాలని పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని ప్రజలను కోరారు. వర్షాభావ పరిస్థితుల వల్ల విద్యుత్ స్తంభాలు కరెంటు తీగలు ఇలాంటి పరికరాలను తాకకుండా దూరంగా ఉండాలని విజ్ఞప్తి చేశారు. అదేవిధంగా ప్రజలు అత్యవసరం ఉంటేనే బయటికి రావాలని లేని పక్షంలో ఇంటిలోనే ఉండాలని విజ్ఞప్తి చేస్తూ  రెవిన్యూ శాఖ అధికారులు మరియు విద్యుత్ శాఖ అధికారులు హెల్త్ డిపార్ట్మెంట్ అధికారులు  ప్రజలకు అందుబాటులో ఉండాలని కోడేరు మండల ఎంపీపీ కొండా రాధాసుధాకర్ రెడ్డి, ఆదేశించారు.