భార్గవ్ షోరూం ఆధ్వర్యంలో క్రీడా సామాగ్రి, పాఠ్య పుస్తకాల పంపిణీ
పినపాక నియోజకవర్గం ఆగష్టు 25 (జనం సాక్షి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు మండలంలోని భార్గవ్ షోరూం యాజమాన్యం ఆధ్వర్యంలో అశ్వాపురం మండలం మల్లెల మడుగు డి పి పి పాఠశాల్లో ని 30 మంది విద్యార్థులకు నోట్ పుస్తకాలు,క్రీడా వస్తువులను మణుగూరు జడ్పిటిసి ఫోశం నరసింహారావు, స్థానిక సర్పంచ్ కోడి క్రిష్ణవేణి చేతుల మీదుగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మణుగూరు భార్గవ్ షోరూం అధినేత విజయ భాస్కర్ రెడ్డి వారి కుమారుడు వినయ్ భాస్కర్ రెడ్డి (ద్వితీయ వర్ధంతి) జ్ఞాపకార్థం ట్రస్ట్ చైర్మన్ విజయ భాస్కర్ రెడ్డి సేవా దృక్పథంతో. మల్లెల మడుగు గ్రామపంచాయతీ లోని పాఠశాల విద్యార్థులకు నోట్ బుక్స్ పాఠ్యపుస్తకాలను క్రీడా సామాగ్రిని అందజేశారు.ఈ కార్యక్రమంలో జడ్పీఎస్ఎస్ ప్రధానోపాధ్యాయులు ప్రేమ్ కుమార్, డి పి పాఠశాల ప్రధానోపాధ్యాయులు పద్మజా విద్యార్థిని విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.