భావితరాలకు సంపూర్ణ స్వచ్ఛత వాతావరణాన్ని బహుమతిగా ఇవ్వాలి.
మండలంలోని కల్వరాల్ ప్రాథమిక పాఠశాలలో ప్రధానోపాధ్యాయులు సంతోష్ ఆధ్వర్యంలో శనివారం ప్రపంచ మరుగుదొడ్డి దినోత్సవం సందర్భంగా సమావేశం నిర్వహించి విద్యార్థులు వారి తల్లిదండ్రులతో కలసి సంపూర్ణ స్వచ్ఛత కోసం పరుగు అనే నినాదంతో ప్రతిజ్ఞ చేశారు.ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయులు మాట్లాడుతూ ప్రస్తుత పరిస్థితుల్లో కూడా చాలా గ్రామాల్లో వారి వారి ఇంటి దగ్గర ఉన్న మరుగుదొడ్లను ఉపయోగించకుండ బయటకు వెళ్ళటానికి అలవాటు పడ్డారని,ఈ పద్దతి ప్రతి ఒక్కరు మార్చుకొని భావితరాలకు ఒక మంచి సంపూర్ణ స్వచ్ఛతతో కూడిన వాతావరణాన్ని బహుమతిగా ఇద్దమన్నారు.ప్రతి ఇంటికి మరుగుదొడ్డి నిర్మించుకొని వాటినే వాడుకునేల చర్యలు చేపట్టాలన్నారు.ఈ పాఠశాలలోని విద్యార్థులకు ఉత్తమ విద్యను అందించేందుకు నిరంతరం కృషి చేస్తానని వారి తల్లిదండ్రులకు తెలియజేశారు.ముక్యంగా పాఠశాలకు సరిగ్గా లేని గేటు,అధికంగా పెరిగిన పిచ్చిగడ్డి,వాటర్ లాంటి సమస్యల వలన పిల్లలు ఇబ్బందులు పడుతున్నారని గ్రామస్తులకు తెలిపారు.సమావేశంలో పాల్గొన్న గ్రామాభివృద్ధి కమిటీ అధ్యక్షులు అలకొండ గంగన్న,గ్రామస్థులు జూకంటి సురేందర్,తమ్మల ఆంజనేయులు పలువురు కలసి పాఠశాలలోని సమస్యలను త్వరలో పూర్తి చేస్తామన్నారు.ఈ కార్యక్రమంలో ఉపాద్యాయులు, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు.