భిక్షాటన చేసి నిరసన తెలిపిన వీఆర్ఏలు
వీఆర్ఏల సమస్యలు పరిష్కరించాలలి
సూర్యాపేట టౌన్ (జనంసాక్షి):సీఎం కేసీఆర్ తమకు ఇచ్చిన హామీలను అమలు చేయకపోవడంపై వీఆర్ఏలు చేపట్టిన నిరవధిక సమ్మెలో భాగంగా శుక్రవారం జేఏసీ పిలుపుమేరకు సూర్యాపేట మండల వీఆర్ఏలు స్థానిక పిఎస్ఆర్ సెంటర్ నుండి ఆర్డీఓ ఆఫీస్ వరకు బిక్షాటన చేసి తమ నిరసన వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా వీఆర్ఏల రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ మీసాల సునీల్ గవాస్కర్ మాట్లాడుతూ గత రెండేళ్ల క్రితం వీఆర్ఏలకు పే స్కేల్ ఇస్తానని హామీచ్చి అమలు చేయలేదన్నారు.సీఎం ఇచ్చిన హామీలను నెరవేర్చాలని,పే స్కేలు అమలు చేయాలని, వారసులకు ఉద్యోగాలు, అర్హత కలిగిన వారికి ప్రమోషన్లు ఇవ్వాలని అనేక మార్లు సీసీఎల్ఏ, కలెక్టరేట్, ఆర్డిఓ, తహశీల్దార్ కార్యాలయం ముందు ధర్నాలు, నిరాహార దీక్షలు,నిరసన కార్యక్రమాలు చేసినప్పటికీ ప్రభుత్వము నుండి ఎలాంటి స్పందన రాకపోవడంతో సమ్మె చేయాల్సి వచ్చిందన్నారు.గత 26 రోజులుగా సమ్మె జరుగుతున్నప్పటికీ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని విమర్శించారు.ప్రభుత్వం తక్షణమే స్పందించకుంటే సమ్మెను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో జిల్లా వీఆర్ఏల సంఘము కో చైర్మన్ మామిడి సైదులు, శ్రీనివాసులు, తండు నగేష్ ,సంతోష్ రెడ్డి , నజీర్, శ్రీను,నాగరాజు , రాజ్యలక్ష్మి , సైదమ్మ , సునీత , చైతన్య , సరిత, శ్రీను, నాగరాజు, వెంకన్న , లింగయ్య ,జానయ్య తదితరులు పాల్గొన్నా