భీమ్‌గల్ ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో తహాశీల్ధార్ కార్యాలయం ముందు దర్నా, వినతి
భీమ్‌గల్, సెప్టెంబర్ 26 (జనంసాక్షి) : భీమ్‌గల్ ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో జర్నలిస్టుల సమస్యలపై తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం, టీ యూ డబ్లూ జే ఐజెయు సంఘాల పిలుపు మేరకు దశల వారి రాష్ట్ర వ్యాప్త ఆందోళనలో భాగంగా గురువారం తహాశీల్ధార్ కార్యాలయం ముందు దర్నా నిర్వహించారు. తహాశీల్ధార్ తారసింగ్ కు వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భీమ్‌గల్ మండల జర్నలిస్టులందరికి ఇళ్ల స్థలాలు, ఇల్లు నిర్మించి ఇవ్వాలి, అందరికి హెల్తు కార్డులు జారీచేసి అన్ని కార్ఫోరేట్ ఆసుపత్రుల్లో అవి చెల్లుబాటు అయ్యేల చర్యలు చేపట్టాలి, 239 జీ.వో. ను రద్ధు చేసి అర్హులైన జర్నలిస్టులందరికి అక్రిడిటేషన్ కార్డులు అందించాలి, 2014 అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా అధికార టీఆర్ఎస్ పార్టీ తన ఎన్నికల ప్రణాళికలో జర్నలిస్టులకు ఇచ్చిన హామీలన్నింటిని నెరవేర్చాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నాగుల వినోద్, షకిల్, శ్రీనాథ్, రఫిక్, అకిల్, అత్తరొద్ధిన్, ఎన్. గోవర్ధన్, బాపూరావ్, తదితరులు పాల్గొన్నారు.