భువనగిరిలో చేవెళ్ల దళిత డిక్లరేషన్ ను విడుదల చేసిన కాంగ్రెస్ పార్టీ ఎస్సి విభాగం నాయకులు….
అంబేద్కర్ గారి విగ్రహానికి పాలాభిషేకం నివాళి
ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్ ను ప్రజల్లోకి తీసుకెళ్లండి పీసీసీ ప్రధాన కార్యదర్శి ప్రమోద్ కుమార్
భువనగిరి టౌన్ జనం సాక్షి
పీసీసీ అధ్యక్షుడు శ్రీ ఏనుముల రేవంత్ రెడ్డి,పీసీసీ ఎస్సీ విభాగం అధ్యక్షులు నాగరిగారి ప్రీతం గారి ?ఆదేశాల మేరకు ఈరోజు యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ గారి విగ్రహానికి యాదాద్రి భువనగిరి జిల్లా కాంగ్రెస్ పార్టీ ఎస్సి విభాగం అధ్యక్షులు దర్గాయి హరిప్రసాద్ ఆధ్వర్యంలో పాలాభిషేకం చేసి పూలమాలు వేసిన అనంతరం కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన చేవెళ్ల దళిత డిక్లరేషన్ ప్రతులను ఆవిష్కరించి పత్రికా విలేకరులకు ప్రజలకు విడుదల చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన పీసీసీ ప్రధాన కార్యదర్శి పొత్నక్ ప్రమోద్ కుమార్ గారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో కెసిఆర్ పాలనలో అత్యంత అణిచివేయబడ్డ దళిత జాతికి గిరిజన జాతికి ఎల్లప్పుడూ అండగా ఉండే కాంగ్రెస్ పార్టీ రాబోవు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో చేయబోయి పథకాలను కార్యక్రమాలను చేవెళ్ల ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్ ద్వారా ఏ ఐ సి సి అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే గారి సమక్షంలో విడుదల చేయడం జరిగిందని ఇందులో పేర్కొన్న పథకాలను కార్యక్రమాలను దళిత గిరిజన ఊర్లలో బస్తీలలో పెద్ద ఎత్తున ప్రచారం నిర్వహించి ప్రజలకు వివరించాలని దళిత గిరిజన జాతిని కాంగ్రెస్ పార్టీ వైపు ఆకర్షింప చేసి రాబోవు ఎన్నికల్లో టిఆర్ఎస్ కేసీఆర్ నియంత పాలనకు చరమగీతం పాడాలని అన్నారు. ఈ కార్యక్రమంలో భువనగిరి మండల ఎస్సీ సెల్ అధ్యక్షులు ఎర్ర శ్రీరాములు, జిల్లా ఉపాధ్యక్షులు కొండపురం గణేష్, జిల్లా నాయకులు చుక్క స్వామి, కాంగ్రెస్ పార్టీ నాయకులు చల్లగురుగుల రఘుబాబు, ఎండి రఫియిధ్ధిన్ ఘోరి, యువజన కాంగ్రెస్ నాయకులు పడిగల ప్రదీప్,జిట్టా మల్లారెడ్డి, ఎర్ర మహేష్, పల్లేపాటి నర్సింగ్, ఐలాపురం బాబు, బర్రె నరేందర్, భుషపాక ఈశ్వర్ బాబు, కొండమడుగు రాము, మంద భాను, పల్లేపాటి సురేందర్, పెంబర్తి రాజేష్, గోపి రాజు తదితరులు పాల్గొన్నారు