భూకంప ధాటికి అఫ్ఘానిస్థాన్‌ అతలాకుతలం

` 2వేలకు పెరిగిన మృతుల సంఖ్య
హేరాట్‌(జనంసాక్షి):అఫ్ఘానిస్థాన్‌వరుస భూకంపాల్లో మృతుల సంఖ్య గణనీయంగా పెరిగింది. భూకంప ధాటికి ఇప్పటివరకు రెండు వేల మందికి పైగా మరణించారు. 400 మందికి పైగా గాయపడ్డారు.హేరాట్‌ నగరంలో శనివారం మధ్యాహ్నం సమయంలో కేవలం గంట వ్యవధిలోనే వరుసగా ఏడు భూకంపాలు సంభవించాయి. పశ్చిమ అప్గాన్‌లో 6.3 తీవ్రతతో వచ్చిన ఈ భూకంపం కారణంగా పలుచోట్ల కొండచరియలు విరిగిపడ్డాయి. వందలాది భవనాలు నేలమట్టమయ్యాయి. భవనాలు కూలిపోవడంతో శిథిలాల కింద నలిగిపోయి ఇప్పటివరకు రెండు వేల మందికి పైగా దుర్మరణం చెందారు. 402 మంది గాయపడ్డారు. కాగా, హేరాట్‌ నగరానికి వాయవ్య మూల 40 కిలోవిూటర్ల దూరంలో భూకంప కేంద్రం ఉన్నట్లు అమెరికా జియాలాజికల్‌ సర్వే వెల్లడిరచింది. కాగా, అఫ్గాన్‌లో తరచూ ఏర్పడే భూకంపాల కారణంగా తీవ్ర ప్రాణ, ఆస్తి నష్టం ఏర్పడుతుంది. గత ఏడాది జనవరిలో ఏర్పడిన భారీ భూకంపం వల్ల వెయ్యి మంది మృతి చెందగా, వేలాది మంది నిరాశ్రయులయ్యారు.