భూనిర్వాసితులను కొట్టడం సిగ్గు చేటు నంగునూరు, జూన్13(జనంసాక్షి):
సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ నియోజకవర్గం అక్కనపేట మండలంలో గౌరవెల్లి రిజర్వాయర్ నిర్మాణం కోసం రైతులు, ప్రజలు తమ భూములు ఇండ్లను సర్వం త్యాగం చేస్తే వారిపై కెసిఆర్ పోలీసులులతో దాడులు చేయించడం సిగ్గు చేటని టీపీసీసీ రాష్ట్ర కార్యదర్శి దేవులపల్లి యాదగిరి ఆగ్రహం వ్యక్తం చేశారు.
గండిపల్లి రైతులను, ప్రజలను అక్రమంగా దాడి చేసి అరెస్టులు చేసి రాజగోపాల్ పోలీస్ స్టేషనుకు తరలిస్తే విషయం తెలుసుకొని వారిని పరామర్శించచినట్లు ఆయన చెప్పారు. ప్రాజెక్టు నిర్మాణంలో భూములు కోల్పోయిన భూనిర్వాసితుల త్యాగం గొప్పదని కేసీఆర్ వారి కాళ్ళు మొక్కిన ఋణం తీరదని గుర్తు చేశారు. పూర్తి అయిన కాళేశ్వరం ప్రాజెక్టు కరెంటు బిల్లు కట్టలేక ప్రాజెక్టుల నుండి సాగుకు నీళ్లు ఇయ్యచేతగాని ప్రభుత్వం పూర్తీ స్థాయి పరిహారం ఇవ్వకుండా ఇలాంటి దుందుడుగు చెర్యలకు దిగడం దివాళా కోరుతాం అన్నారు.చట్టపరమైన పరిహారమిచ్చి సానుకులంగా స్పందించి న్యాయం చేయాల్సింది పోయి తిరుగుబాటు చేయడం సిగ్గు చేటు,నీచమైన చర్య అన్నారు.
కెసిఆర్ ఫమ్ హౌస్ చుట్టున్న వ్యాసాయ భూములకు ఎకరానికి రెండుకోట్ల రూపాయలు పెట్టి కొనుగోలు చేస్తున్నడని,
పంజాబ్ రాష్ట్ర రైతు కుటుంబాలకు
ఒక్క కుటుంబానికి మూడు లక్షల రూపాయలు ఇచ్చి సొంత జిల్లా రైతులపైనా ఇంత విద్వేషం ఎందుకొచెప్పాలని నిలదీశారు.వారికీ పూర్తిస్థాయిలో పరిహారం ఇచ్చిన తరువాతనే ట్రయల్ రన్ ప్రక్రియ జరుపుపాలని కోర్టు చెప్పిన కూడా ప్రభుత్వం దొర, నియంత పోకడతో నిర్వాసితులను బలవంతంగా ఊరు ఖాళీ చేయించాలని చూడడం దివాళా కోరుతనమన్నారు.గ్రామస్తులపై దాడి చేసిన పోలీస్ అధికారులను వెంటనే
సస్పెండ్ చేయాలి,నిర్వాసితుల న్యాయ పరమైన డిమాండ్లను పరిష్కరించాలి,స్థానికులను,ప్ రజా ప్రతినిధులను అరెస్ట్ లు చేసి సరిహద్దు పోలీస్ స్టేషన్ లకు తరిలించే ప్రక్రియను ఆపివేయాలని డిమాండ్ చేసారు.
ఈ కార్యక్రమములో రాగుల కనకయ్య ,రంగు అశోక్ గౌడ్ ,చెలికాని యాదగిరి ,అనరాజు నాగరాజు,తిప్పని రాజేశ్వర్ లు పాల్గొన్నారు.