భూసేకరణపై కాంగ్రెస్‌ రణం

4

పార్లమెంట్‌ ముంధు ధర్నా

చర్చకు సిద్ధమన్న పాలకపక్షం

న్యూ ఢిల్లీ, ఫిబ్రవరి 25(జనంసాక్షి): కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన భూసేకరణ బిల్లును వ్యతిరేకిస్తూ జవిూన్‌ వాపసీ పేరిట కాంగ్రెస్‌ పార్టీ ఢిల్లీలోని జంతర్‌మంతర్‌ వద్ద భారీ ధర్నా చేపట్టింది. ఈ ధర్నాలో పార్టీకి చెందిన ముఖ్యనేతలు పాల్గొన్నారు. నూతన భూసేకరణ బిల్లు రైతులకు పూర్తి వ్యతిరేకంగా ఉందని కాంగ్రెస్‌ నాయకులు విమర్శించారు. ప్రభుత్వం పార్లమెంట్‌లో ప్రవేశపెట్టిన భూసేకరణ బిల్లు కార్పోరేట్‌ రంగాలకు అనుకూలంగా ఉందని వారు ఆరోపించారు. 2013లో యూపీఏ ప్రభుత్వ హయాంలో రాజ్యసభ, లోక్‌సభలో ఆమోదం పొందిన భూసేకరణ బిల్లును బీజేపీ ప్రభుత్వం కావాలనే మారుస్తోందని కాంగ్రెస్‌ నేత జైరాం రమేష్‌ ఆరోపించారు. మరోవైపు భూసేకరణ ఆర్డినెన్సుపై చర్చకు ప్రభుత్వం సిద్ధంహా ఉందని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి వెంకయ్యనాయుడు స్పష్టంచేశారు. అయితే చర్చ నిర్మాణాత్మకంగా ఉంటేనే ప్రభుత్వం అనుమతిస్తుందని, అడ్డగోలు వాదనలు పక్కనబెట్టి, అవసరమైన విషయాలపై చర్చించాలని ఆయన సూచించారు.