భూసేకరణ చేసుకోండి

2

– జీవో 123 స్థానంలో 190 జీవో విడుదల

హైదరాబాద్‌,ఆగస్టు 16(జనంసాక్షి):మెదక్‌ జిల్లాలో నిమ్జ్‌ భూముల సేకరణకు హైకోర్టు అనుమతిచ్చింది. పరిశ్రమలు ఏర్పాటు చేసే వరకు భూములను లాక్కోవద్దని తెలిపింది. మెదక్‌ జిల్లా జహీరాబాద్‌ వద్ద పారిశ్రామికవాడ కోసం భూములు కొనుగోలు చేసుకోవచ్చని హైకోర్టు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది.జి.ఓ 123 కి అనుబంధంగా జిఓ 190 ని ప్రభుత్వం జారీ చేసిన జిఓ కాపీని హైకోర్టుకు ప్రభుత్వం సమర్పించింది.ఆ జిఓ చూసిన హైకోర్టు భూముల కొనుగోళ్లకు ఓకే చేసింది. అయితే సాగు లో ఉన్న భూములను ఖాళీ చేయించవద్దని, పునరావాసం చూపకుండా ఇళ్లు ఖాళీచేయించవద్దని హైకోర్టు సూచించింది. బాధితులు వస్తేనే పిటిషన్‌ లు పరిష్కరిస్తామని కూడా హైకోర్టు స్పష్టం చేసింది. హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులతో ప్రభుత్వానికి భూ సేకరణకు సంబందించిన ప్రధాన అడ్డంకులు తొలగిపోయినట్లయింది.  123 జీవోపై తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టులో ఊరట లభించింది. మెదక్‌ జిల్లా నిమ్జ్‌ కోసం భూసేకరణ చేపట్టవచ్చని న్యాయస్థానం అనుమతి ఇచ్చింది. దీంతో జీవో 123 లోపాలను సవరిస్తూ 190 జీవోను విడుదల చేసినట్లు తెలంగాణ ప్రభుత్వం ఈ సందర్భంగా హైకోర్టుకు విన్నవించింది. ఈ మేరకు 190 అనుబంధ జీవో కాపీని న్యాయస్థానానికి సమర్పించింది. పరిశ్రమలు వచ్చేంతవరకూ బలవంతంగా రైతులను, నిర్వాసితులను ఖాళీ చేయించవద్దని హైకోర్టు… ప్రభుత్వానికి సూచించింది. తదుపరి విచారణను వాయిదా వేసింది. ఇదే సందర్భంలోమెదక్‌ జిల్లాలో భూసేకరణ, కొనుగోళ్లకు తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టు అనుమతినిచ్చింది. అయితే ఇదే సమయంలో బలవంతంగా భూసేకరణ చేయవద్దని ఆదేశించింది. బాధితులు నేరుగా కోర్టులో పిటిషన్‌ వేయాలని రాజకీయ నేతలు పిటిషన్‌ వేస్తే స్వీకరించబోమని హైకోర్టు స్పష్టం చేసింది. జిల్లాలో భూసేకరణకు సంబంధించి జీవోనెం.190ను ప్రభుత్వం జారీ చేసింది. ఇందుకు వ్యతిరేకంగా పలువురు రైతులు కోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. ప్రభుత్వం తమ నుంచి బలవంతంగా భూములను కొనుగోళ్లు చేస్తోందని పిటిషన్‌లో పేర్కొన్నారు. దీనిపై ఈరోజు హైకోర్టులో విచారణ జరిగింది. ఇందులో భాగంగా 190జీవో కాపీని ప్రభుత్వం హైకోర్టుకు అందజేసింది. దాన్ని పరిశీలించిన హైకోర్టు భూముల కొనుగోలుకు అంగీకారం తెలిపింది. అలాగే సాగు చేస్తున్న రైతుల నుంచి భూములను సేకరించవద్దని, ఖాళీగా ఉన్న భూములనే సేకరించాలని హైకోర్టు స్పష్టం చేసింది. తదుపరి విచారణను వాయిదా వేసింది.