భూసేకరణ వేగంగా జరగాలి: కలెక్టర్‌

మహబూబ్‌నగర్‌,జూలై23(జ‌నంసాక్షి): జిల్లాలో పెండింగ్‌ ప్రాజెక్టు పనులకు సంబంధించి అడ్డుగా మారిన భూ సేకరణ పనులు మరింత వేగవంతం అయ్యేందుకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ రొనాల్డ్‌రోస్‌ అన్నారు. కోయిల్‌సాగర్‌, భీమా, పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుల కింద మిగిలిపోయిన భూ సేకరణపై సంబంధిత అధికారులతో సవిూక్షా సమావేశం నిర్వహించారు. ప్రాజెక్టు భూములకు సంబంధించిన వివరాలను ప్రతి గ్రామంలో తిరిగి తీసుకురావాలని అన్నారు. ప్రాజెక్టు పనుల రైతులకు డబ్బులు ఇస్తేనే పనులకు ఆటంకం లేకుండా పనులు సాఫీగా జరుగుతాయన్నారు. మాగనూర్‌, మక్తల్‌లో అవార్డు పాసైనా రిపోర్టులో ఎందుకు కనబడుట లేదని, ఈ నెల చివరి నాటికి పూర్తి వివరాలను వారం రోజుల్లో అక్కడే ఉండి నివేదికలు తయారు చేయాలన్నారు. గట్టుపల్లితాండ నిర్వాసితులైన వారికి నూతన స్థలాలను చూయించాలని సంబంధింత అధికారులకు సూచించారు. వారంలోగా పెండింగ్‌లో ఉన్న వాటిని పరిష్కరించే విధంగా చూడాలన్నారు.