భూ బాధితురాలు శివమ్మకు న్యాయం

రాయి కోడ్ అక్టోబర్ 17 జనం సాక్షి రాయి కోడ్ మండలం

భూ బాధితురాలు శివమ్మకు న్యాయం

అండగా జిల్లా యంత్రాంగం

అక్రమ పట్టా మార్పిడిని రద్దు చేసి శివమ్మ పేరిట మార్చిన 27.34 ఎకరాలు

హర్షం వ్యక్తం చేస్తున్న శివమ్మ కుటుంబ సభ్యులు

అక్రమాలను సహించబోము
..జిల్లా కలెక్టర్ డాక్టర్ శరత్

 

అమాయకులైన రైతుల భూములను తప్పుడు ద్రువ పత్రాలతో ఇతరుల పేరిట పట్టా మార్పిడికి పాల్పడటం లాంటి అక్రమాలు చేస్తే ఉపేక్షించబోమని జిల్లా కలెక్టర్ డాక్టర్ శరత్ అన్నారు.

జిల్లాలో ఇటీవల రాయికోడ్ మండలం నాగన్ పల్లికి చెందిన పట్లోళ్ళ శివమ్మ పేరిట సర్వేనెంబర్ 198 లో గల 27.34 ఎకరాల భూమిని తహసిల్దార్ ఆమె బ్రతికుండగానే ఇతరుల పేరిట పట్టా మార్పిడి చేసినట్లు సెప్టెంబర్ 21న శివమ్మ తమ దృష్టికి తీసుకు వచ్చిందన్నారు. ఇట్టి విషయమై వెంటనే విచారణ చేయగా, సంబంధితురాలి భూమి పౌతి నిబంధనలకు విరుద్ధంగా పౌతీచేసినట్లు రుజువైందన్నారు. అట్టి నివేదికను ప్రభుత్వానికి సమర్పించామన్నారు.

పూర్తి నివేదిక మేరకు ప్రభుత్వం శివమ్మ భూమిని ఆమె పేరుట చేయడానికి ఆదేశాలు జారీ చేసిందన్నారు.

ఆ మేరకు ఇతరుల పేరిట పట్టా మార్పిడి చేసిన భూమిని రద్దు చేసి తిరిగి పట్లోళ్ల శివమ్మ పేరిట పట్టా చేసినట్లు కలెక్టర్ వివరించారు.

అక్రమాలకు పాల్పడిన శేరి అంజమ్మ,ఆమె కుమారుల పై చట్ట ప్రకారం చర్యలు చేపట్టా మని,ఇప్పటికే సంబంధిత తహశీల్దారు ను సస్పెండ్ చేసామని, సిబ్బంది పై చర్యలు తీసుకున్నట్లు కలెక్టర్ తెలిపారు.

జిల్లాలో ఇలాంటి అక్రమాలకు పాల్పడిన వారు ఎంతటి వారైనా కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు.

చెప్పలేనంత ఆనందంగా ఉంది.. పట్లొల్ల శివమ్మ
పోయిందనుకున్న నా భూమిని నా పేరిట మార్చిన ప్రభుత్వానికి,జిల్లా కలెక్టర్ కు రుణపడి ఉంటానని పట్లోల్ల శివమ్మ పేర్కొన్నారు.

భూమి ఇతరుల పేరిట మారిన విషయాన్ని జిల్లా కలెక్టర్ గారికి తెలుపగానే వెంటనే స్పందించి వెంట వెంటనే అన్ని విధాల చర్యలు తీసుకున్నారు.రోజు నిద్ర కూడా పోవడం లేదని,ఏమైతుందో ఏమొనని భయపడుతున్న నాకు, నా కుటుంబానికి దిగులుపెట్టుకోవద్దని,నీ భూమి ఎక్కడికీ పోదు.నీ భూమిని కాపాడే బాధ్యత నాదని కలెక్టర్ బరోసా నిచ్చా రని,అన్న మాట ప్రకారం నా భూమి నా పేరిట మార్చారు. ఇంత తొందరగా( ఒక నెల లోపే) పోయిందని అనుకున్న భూమి నాది నాకు వచ్చేలా, మా వెన్నంటి ఉండి దైర్యాన్ని అందించిన అధికారులకు అందరికీ ఆమె హృదయ పూర్వక కృతజ్ఞతలు తెలిపారు.