భూ సమస్య తీర్చాలంటు శవంతో ధర్నా నిర్వహించిన బంధువులు

రుద్రంగి జూలై 18 (జనం సాక్షి)
రుద్రంగి మండల కేంద్రానికి చెందిన కోలా నర్సారెడ్డి అనే వ్యక్తికి సంకినేని లక్ష్మణ్ రావు అనే వ్యక్తి 370/అ సర్వే నంబర్ లో గలా రెండు ఎకరాల భూమి అమ్మాడని అట్టి భూమిని నర్సారెడ్డికి తెలియకుండా లక్ష్మణ్ రావు వేరే వారికి అమ్మాడని ఆవేదనతో నర్సారెడ్డి అనారోగ్యంతో మంచాన పడి చనిపోయాడని కుటుంబ సభ్యులు అంబెడ్కర్ చౌక్ లో శవంతో ధర్నా నిర్వహించారు.ఒకే భూమిని ఇద్దరు వ్యక్తులకు అమ్మిన లక్ష్మణ్ రావు పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.లక్ష్మణ్ రావు కు చెందిన స్థలంలోనే శవాన్ని దహనం చేయడానికి ప్రయత్నం జరుగుతుందని పోలీసులు భారీగా మోహరించారు.లక్ష్మన్ రావు చేసిన అన్యాయానికి నర్సారెడ్డి చనిపోయాడని అతని కుటుంభం రోడ్డున పడిందని అతనిపై చర్యలు తీసుకొని లక్ష్మణ్ రావు దగ్గర నుండి భూమిని నర్సారెడ్డీ భార్య పేరుమీద చెయ్యాలని కోరారు.పోలీసులు నర్సారెడ్డి కుటుంబానికి న్యాయం చేస్తా అని చెప్పడంతో ధర్నా విరమించారు