భైంసాపట్టణంలో స్పెషల్ మిఠాయి గేవర.
భైంసా రూరల్ జనవరి 13 జనం సాక్షి
– రాజస్థానీ రకం స్వీట్ సంక్రాంతి పండగకి ప్రత్యక్ష0…
ఆంధ్రపూతరేకులు, కాకినాడ కాజాఎంతప్రత్యేకమో… భైంసా పట్టణంలో గేవర మిఠాయి అంత ప్రత్యేకం.తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ కనిపించని రాజస్థానీ రకం స్వీట్ గేవర…కేవలం భైంసాపట్టణంలో ప్రతి సంక్రాంతికి తయారై సందడి చేస్తుంది.తాలూకాలో సంక్రాంతి వచ్చిందంటే చాలు ఈ స్వీట్ తిననివారు ఉండరు.సంక్రాంతిరోజు ఈ స్వీట్ (గేవర)తినడం కాలక్రమంగా రివాజ్ అయిపోయింది.గత కొన్ని దశాబ్దాలుగా రాజస్థానీలు బైంసాలోస్థిరపడి ఉండడం, మొదట్లో మోహన్ లాల్ మైదాపిండి,వనస్పతి,పాలు,నెయ్యి, చక్కెరతో తయారయ్యే ఈ మిఠాయిని దాదాపు 45 సంవత్సరాల కిందట భైంసా పట్టణ ప్రజలకు పరిచయం చేశారు.కేవల0 సంక్రాంతి పండగ సీజన్లోనే ఈ రకం స్వీట్ దొరుకుతుంది. ఇక్కడ తయారుచేసే గేవర తెలంగాణ పలుజిల్లాలు,దేశ పలు రాష్ట్రాలు,అమెరికా, దుబాయ్ లాంటి దేశాలకు సైతం ఇష్టంగా తీసుకెళ్తారు. మారుతున్న కాలానికి అనుగుణంగా ఈ స్వీటీకి మలాయి కలిపి మాలాయి గెవరను బోధిలాల్, శ్రీనివాస్ వర్మ తాలుక ప్రజలకు పరిచయం చేశారు.ఇక్కడి ప్రజలకు ప్రస్తుతం ఈ స్వీటు సంక్రాంతి పండగ రోజు కచ్చితంగా తినాలి అన్నంత ఆనవాయితి అయిపోయింది