మంగళపల్లిలో బొడ్రాయి నిర్మాణానికి భూమి పూజ.

భీమదేవరపల్లి మండలం
జనంసాక్షి న్యూస్
 భీమదేవరపల్లి మండలం మంగళపల్లి గ్రామంలో బొడ్రాయి నిర్మాణానికి భూమి పూజ చేయడం జరిగింది. గట్ల నర్సింగాపూర్ కు చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్త గుండవరం భాస్కర్ రావు సహకారంతో మంగళపల్లి, రాంనగర్ లలో బొడ్రాయి పండుగను నిర్వహించుకోవడంతోపాటు భాస్కర్ రావు గారు నిర్మించిన ఆంజనేయ స్వామి ఆలయంలో విగ్రహ ప్రతిష్టను జూలై 7న చేయుటకు నిర్ణయించడం జరిగింది. బొడ్రాయి మరియు నూతన ఆలయంలో విగ్రహ ప్రతిష్ట చేయుటకు కార్యక్రమం జూలై 5న మొదలై జులై 7తో గ్రామ సర్పంచ్ భూక్య కవితా తిరుపతి తెలిపారు. ఈ సందర్భంగా బొడ్రాయి కమిటీ అధ్యక్షులు కనకం నరేష్ మాట్లాడుతూ ఈ గ్రామ పండుగలో గ్రామస్తులందరూ పాల్గొని వారి పూర్తి సహకారాన్ని అందించాలని గ్రామస్తులను కోరారు
.
Attachments area