మంచం పట్టిన మోదేడు

కరీంనగర్‌/మహదేవ్‌పూర్‌: మండలంలోని పంచన గ్రామ పంచాయితీ మోదేడు గ్రామంలో విష జ్వరాలు, డయేరియా ప్రబలి ఇబ్బందులు పడుతున్నారు. భారీ వర్షాల కారణంగా వాగులు పొంగి ప్రవహించటంతో రవాణా స్తంభించిపోయింది. వైద్య సిబ్బంది అందుబాటులో లేక గ్రామంలో 20మంది వరకు మంచం పట్టారు. వెంటనే వైద్య సిబ్బందిని పంపి చికిత్స చేయించాలని గ్రామస్థులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.