మండలంలోని పలు గ్రామాలలో అమరవీరుల స్మారక సభలు

కోమట్ల గూడెం గ్రామంలో నరహంతక పీపుల్స్ వారు మూట చే హత్యకు గురైన
గొగ్గల.లక్ష్మన్న స్తూపం పై సీనియర్ నాయకులు తాళ్ల కొమురెల్లి ఎర్రజెండా ఎగురవేశారు. ప్రతిఘటన మోటాచే హత్య గురైన జనగం నారాయణ
స్థూపం పై మధుర కోళ్ల సాంబన్న ఎర్రజెండా ఎగరవేశారు.కాటినగరం గ్రామంలో ఎమర్జెన్సీ కాలంలో పోలీస్ ఎన్కౌంటర్లో అమరుడైన ఈసం లక్ష్మన్న స్థూపం పై ఈసం సారన్న ఎర్రజెండా ఎగరవేశారు.
పెద్ద ఎల్లపురం గ్రామంలో అమరుడు పరిదల శ్రీను స్తూపంపై సీనియర్ నాయకులు గుండగాని జనార్ధన్ ఎర్రజెండా ఎగరవేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న పుల్లన్న మాట్లాడుతూ అమరుల త్యాగాలు వెలకట్టలేనివి గోదావరి
లోయ ప్రతిఘటన పోరాటంలో ఎందరో అమరులు తమ రక్తంతో ఎర్రజెండాను ఎరుపెక్కించారు. భూమికోసం భుక్తి కోసం ఈ దేశ విముక్తి.కోసం ప్రాణాలర్పించిన అమరవీరులకు విప్లవ జోహార్లు. ఈ ప్రాంతంలో ప్రజా ఉద్యమాలకు నాయకత్వం వహిస్తున్న ఎంతోమంది కామ్రేడ్స్ తన అమూల్యమైన ప్రాణ త్యాగం చేసి విరోచితమైన పోరాటంలో పాల్గొని ప్రభుత్వ పాసవిక నిర్బంధ అనుభవించి పోరాట పందకు రూపం ఇచ్చిన త్యాగదనులు మీ త్యాగాలు వెలకట్టలేనివి కాబట్టి రాబోయే తరానికి మీరు వారసులుగా వారదులుగా నిలిచారని ఈ సందర్భంగా పేరుపేరునా అమరవీరులను కొనియాడాడు ఈ కార్యక్రమంలో సిపిఎంఎల్ న్యూడెమోక్రసీ జిల్లా కార్యదర్శి బండారు ఐలయ్య డివిజన్ కమిటీ కార్యదర్శి పెనక వెంకన్న గ్రామ నాయకులు తాళ్ల కొమురెల్లి. గుండగాని జనార్ధన్, ఈసం సారయ్య. ముదురుకోళ్ల సాంబయ్య మల్లన్న. రవి . మెడ గణేష. శ్రీకాంత్. జున్ను అశోక్. జయేందర.మధుకర్ తదితరులు పాల్గొన్నారు.