మండలంలో పర్యటించిన ఎమ్మెల్యే సతీమణి బీరం విజయమ్మ
చిన్నంబావి అక్టోబర్ 28 జనం సాక్షి
చిన్నంబావి మండలంలో వెలగొండ, మియాపూర్ గ్రామంలో సత్తెమ్మ తల్లి దేవాలయం దర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అలాగే వాల్మీకి మహర్షి జయంతి సందర్భంగా మియాపూర్, వెలగొండ గ్రామ వాల్మీకి కుటుంబాలకు వాల్మీకి జయంతి శుభాకాంక్షలు తెలిపారు. గ్రామ ప్రజలు విజయమ్మ ను శాలువాతో సత్కరించారు. అనంతరం గ్రామంలోని పలు సమస్యల పైన విజయమ్మ ప్రజలను అడిగి తెలుసుకున్నారు. ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి తిరిగి గెలిచిన తర్వాత ఈ గ్రామాన్ని 100% అభివృద్ధి గ్రామంగా తీర్చిదిద్దుతామని విజయమ్మ మియాపూర్ ప్రజలకు హామీ ఇచ్చారు. మియాపూర్ గ్రామానికి ఎమ్మెల్యే బీరం అన్ని విధాల చేయూతను అందిస్తూ గ్రామాన్ని ఎంతో అభివృద్ధి పథంలో నడిపించారని గ్రామస్తులు సంతోషం వ్యక్తం చేశారు. సత్యమ్మ టెంపుల్ డెవలప్మెంట్ విషయంలో ఎమ్మెల్యే పాత్ర అమోఘమని 19 సంవత్సరాల అసమర్ధ నాయకుడు పాలనను కేవలం రెండు సంవత్సరాల లోనే మియాపూర్ గ్రామాన్ని ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి ఎంతో అభివృద్ధి చేశారని ప్రజలు ఆనందం వ్యక్తం చేశారు. సత్యమ్మ టెంపుల్ కు సిసి రోడ్లు, విద్యుత్తు సౌకర్యము, హైమాస్ లైట్లు, ముఖ్యంగా సత్యమ్మ టెంపుల్ దగ్గర ఉండే గుండాన్ని మరియు మంచినీటి సౌకర్యార్థం ఫిల్టర్ వాటర్ ను ఏర్పాటు చేశారు. ప్రజలకు ఉపయోగపడే విధంగా పరిశుభ్రంగా చేసి అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందించిన ఎమ్మెల్యే కి మేమంతా మా ఓటు ద్వారా రుణం తీర్చుకోవడానికి సిద్ధంగా ఉన్నామని గ్రామ ప్రజలు ముక్తకంఠంతో చెప్పారు. వచ్చే నెల నవంబర్ 30 తారీఖున హర్షవర్ధన్ రెడ్డి కారు గుర్తు పైన మా ఓటు వేసి వేయించి మా గ్రామం నుండి అత్యధిక మెజార్టీ ఇస్తామని గ్రామ ప్రజలు, మహిళలు ఘంటాపదంగా చెప్పారు. కారు గుర్తుకే మన ఓటు అనే నినాదాలతో మియాపూర్ దద్దరిల్లిపోయింది. ఈ కార్యక్రమంలో విజయమ్మ వెంబడి చిన్నంబావి మండల జడ్పిటిసి వెంకటరామమ్మ, ఉమ్మడి మండలాల టిఆర్ఎస్ పార్టీ వ్యవహారాల ఇంచార్జ్, పెద్ద మారు సర్పంచ్ గోవింద్ శ్రీధర్ రెడ్డి, అమ్మాయి పల్లి సర్పంచ్ చక్రధర్ గౌడ్, ఇంద్రసేనారెడ్డి, శ్రీధర్ రెడ్డి, చిన్నారెడ్డి, శరత్ రెడ్డి, గోపాల్, నారాయణ బిఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు, మరియు ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.