మండలం కోసం కొనసాగుతున్న దీక్షలు
రాజాపేట, అక్టోబర్20 ( జనంసాక్షి) : యాదాద్రి భువనగిరి జిల్లా రాజాపేట మండలంలోని రఘునాథపురం గ్రామాన్ని మండలంగా ప్రకటించాలని జేఏసీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న రిలే నిరాహార దీక్ష గురువారం 72వ రోజు కొనసాగింది. గురువారం రాజపేట మండల ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు ఉప్పల రమేష్ పాల్గొని సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… అన్ని అర్హతలు ఉన్న రఘునాథపురం గ్రామాన్ని వెంటనే మండలంగా ప్రకటించాలన్నారు. మండలం ఏర్పాటయ్యే వరకు ఆర్యవైశ్యుల మద్దతు ఎప్పటికీ ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో రాజపేటగ్రామ సర్పంచ్ ఆడెపు ఈశ్వరమ్మ శ్రీశేలం నేమిల గ్రామస్థులు సిలువేరు బాలరాజుగౌడ్ జేఏసీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.