మండలాల్లో ఘనంగా మంత్రి జగదీష్ రెడ్డి జన్మదిన వేడుకలు

జూలై 18 (జనం సాక్షి) ‌: హుజూర్ నగర్ నియోజకవర్గ  శాసనసభ్యులు  శానంపూడి సైదిరెడ్డి సూచన మేరకు మండలంలో వివిధ గ్రామాల్లో రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రివర్యులు  గుంటకండ్ల జగదీశ్ రెడ్డి జన్మదిన వేడుకలను సోమవారం ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది అన్నారు.  మండలం లోని అమరవరం గ్రామంలో నిర్వహించిన రాష్ట్ర విద్యుత్తు శాఖ మంత్రివర్యులు గుంటకండ్ల జగదీష్ రెడ్డి  జన్మదిన వేడుకలకు  హుజూర్ నగర్ జెడ్పిటిసి కొప్పుల సైదిరెడ్డి హాజరై, సర్పంచ్ గుజ్జుల సుజాత అంజిరెడ్డి లతో కలసి కేక్ కట్ చేసి స్వీట్లు పంచుకుని మంత్రి జగదీష్ రెడ్డి జన్మదినాన్ని ఘనంగా జరుపుకున్నారన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నాడు ఉమ్మడి నల్లగొండ జిల్లా తెలంగాణ ఉద్యమానికి పెద్దదిక్కుగా ఉండి జిల్లా రథసారధిగా ప్రజలను ఉద్యమంలో మమేకం చేయడంలో కీలక పాత్ర పోషించారన్నారు. తెలంగాణ వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ ఆశీస్సులతో విద్యుత్ శాఖ మంత్రిగా ఈ జిల్లాను సమగ్ర అభివృద్ధి చేయడంలో నిరంతరం శ్రమిస్తున్నారన్నారు. గతంలో ఎన్నో సమస్యలతో కొట్టుమిట్టాడిన ఉమ్మడి నల్గొండ జిల్లాను ఈరోజు రాష్ట్రంలో అభివృద్ధి పథంలో ముందు వరుసలో ఉంచారన్నారు. ముఖ్యమంత్రి కెసిఆర్ ని, ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డికి ప్రతిపక్షాలు ఎన్ని అడ్డంకులు సృష్టించిన వాటన్నిటిని తిప్పికొట్టి కెసిఆర్, కేటీఆర్ ఆశీస్సులు, మంత్రి జగదీష్ రెడ్డి సహకారంతో నియోజకవర్గంలో 3500 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులను కొనసాగిస్తున్నారు అని తెలిపారు. మంత్రి జగదీష్ రెడ్డి నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో జీవించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో మాజీ పిఎసిఎస్ చైర్మన్ గ్రామ పార్టీ అధ్యక్షులు కామిశెట్టి వెంకటేశ్వర్లు, టిఆర్ఎస్ నాయకులు ఉస్తెల లింగారెడ్డి, వార్డు సభ్యులు సామల మట్టారెడ్డి , షేక్ ముస్తఫా, టిఆర్ఎస్ పార్టీ నాయకులు హనుమారెడ్డి, వెంకటరెడ్డి, అంకిరెడ్డి, సుధీర్ రెడ్డి, లింగరాజు , రాజశేఖర్ రెడ్డి, రాజు వెంగల్ రెడ్డి , వీరలింగం లక్ష్మయ్య, సతీష్, గురు స్వామి తదితరులు పాల్గొన్నారు.
Attachments area