మండల కేంద్రంలో 12వ రోజు కొనసాగుతున్న రిలే నిరాహార దీక్షల.

బూర్గంపహాడ్ ఆగష్టు30 (జనంసాక్షి) భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, బూర్గంపహాడ్ మండల కేంద్రంలో గోదావరి వరద బాధిత గ్రామాలను పోలవరం ముంపు గ్రామాలుగా గుర్తించి 2013 భూసేకరణ చట్టం ప్రకారం పరిహారం అందించాలని, లేదా పోలవరం ప్రాజెక్టు నిర్మాణాన్ని నిలిపివేయాలని సాగుతున్న నిరవధిక రిలే నిరాహార దీక్ష నేటికీ 12వ రోజుకు చేరుకున్నాయి. మంగళవారం దీక్షలో పాల్గొన్న హిందూ, ముస్లిం మహిళలు, పురుషులు మాజీ ఎమ్మెల్యే సతీమణి కుంజా వెంకటరమణ, మహిసాక్షి రామ సీత, కనసాని గోవిందమ్మ, చిప్ప మానిక్యమ్మ, ఎస్.కె గౌస్య బేగం, శాంకూరి వెంకటేశ్వరరావు ,ఎస్.కె రహి మున్నీసా, ఎస్.డి అభిబ్ సాలే, ఎండి అబ్దుల్ నహీం, మున్నా, యస్ కే ముజీబ్, ముకిబ్, తోక లక్ష్మయ్య, ఎస్ కె కాజా, ఎస్.కె దరియబి, ఎం ఏ షంషాద్, ఎస్ కె నవాబి, జూపాటీ నరసింహ పాల్గొన్నారు. దీక్షా శిబిరాన్ని సందర్శించి దీక్షలో పాల్గొన్న వారికి సంఘీభావం ప్రకటించిన కాంగ్రెస్ మండల అధ్యక్షులు కృష్ణారెడ్డి, కనితి కృష్ణ , పోలుకొండ ప్రభాకర్, కేసు పాక బొందయ్య, ఆటో యూనియన్ సభ్యులు, జేఏసీ ప్రధాన కార్యదర్శి దామర శ్రీను, యువ నాయకుడు బబ్బు రాయుడు, సామాజిక న్యాయ వేదిక జిల్లా అధ్యక్షుడు కోడి బోయిన రవి, గ్రామ పెద్దలు గోనెల చిన్న సడలు తదితరులు సంఘీభావం ప్రకటించారు.