మండల కేంద్రంలో 6వ రోజు కి చేరిన రిలే నిరహార దీక్ష

– సంఘీభావం తెలిపిన కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ అధ్యక్షులు చందా సంతోష్..

బూర్గంపహాడ్ ఆగష్ట్24 (జనంసాక్షి) భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, బూర్గంపహాడ్ మండల కేంద్రంలో 6వ రోజు కి చేరిన నిరవధిక రిలే నిరహార దీక్ష. స్థానిక మండలాన్ని పోలవరం ముంపు మండలంగా ప్రకటించి మెరుగైన ప్యాకేజ్ 2013 భూ సేకరణ చట్టం ప్రకారం సమగ్ర పరిహారం ఇవ్వాలని కోరుతూ దీక్షలు కొనసాగుతున్నాయి. 6వ రోజు దీక్షలో యాదవుల బస్తి నుండి పెద్ద సంఖ్యలో మహిళలు, ముస్లిం మహిళలు దీక్షలో పాల్గొన్నారు. వీరికి మాజీ ఎమ్మెల్యే కుంజా బిక్షం సతీమణి కుంజా వెంకటరమణ, కనసాని గోవిందమ్మ, మహిషాక్షి రామ సీత చేతులు మీదుగా దీక్షలో పాల్గొన్న మహిళలకు పూలమాలలు వేసి దీక్ష ప్రారంభించారు. బుధవారం దీక్ష శిబిరాన్ని కాంగ్రెస్ నియోజకవర్గ అధ్యక్షులు చందా సంతోష్ సందర్శించి సంఘీభావం తెలియజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బూర్గంపహాడ్ మండలంలోని గోదావరి ముంపు గ్రామాలకు శాశ్వత పరిష్కారం చూపించాలని ప్రభుత్వాలను డిమాండ్ చేశారు. అనంతరం ఈ దీక్షలో వారు కూడా పాల్గొన్నారు. కన్వీనర్ కె.వి రమణ మాట్లాడుతూ 29 ఆగస్టు న చలో కలెక్టరేట్ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాలని అన్ని వర్గాల ప్రజలను మండలంలోని ముంపు ప్రాంత ప్రజలను కోరారు. ఈ సమస్య ప్రభుత్వాల దృష్టికి వెళుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. దీక్షా శిబిరంలో మహిళలందరూ ముంపు బాధిత గ్రామాలను గుర్తించి పోలవరం ప్యాకేజీ ప్రకటించాలని పెద్ద ఎత్తున నినదించారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ అధ్యక్షుడు చందా సంతోష్ మండల అధ్యక్షులు దుగ్గెంపూడి కృష్ణారెడ్డి, జిల్లా మైనారిటీ అధ్యక్షులు మహమ్మద్ ఖాన్, మందా నాగరాజు, ఎల్లంకి రామకృష్ణ, బర్ల నాగమణి, కొమ్ము నాగేంద్రబాబు, జేఏసీ కన్వీనర్ కె.వి రమణ,  ప్రధాన కార్యదర్శి దామర శీను, మున్న మొహమ్మద్, డేగల ధర్మయ్య, చీర్ల భద్రమ్మ, కణసాని గోవిందమ్మ , పోలుకొండ ప్రభాకర్, భూపల్లి నరసింహారావు, దాసరి సాంబ, రాయల వెంకటేశ్వర్లు, చిన్న యాకుబ్, యస్ కె బాబా,  ఆటో యూనియన్ సభ్యులు, పాసికంటి మురళి, ముదిగొండ బాలకృష్ణ, తదితరులు పెద్ద సంఖ్యలో ముస్లీం,  హిందూ, క్రిష్టియన్, అన్ని వర్గాల మహిళలు పాల్గొన్నారు.