మండల పరిషత్ కార్యాలయంలో పెండింగ్ సమస్యలు వెంటనే పరిష్కరించాలి…

 

 

 

 

 

 

 

 

నేషనల్ హ్యూమన్ రైట్స్ మండల వర్కింగ్ ప్రెసిడెంట్ విష్ణువర్ధన్
కేసముద్రం సెప్టెంబర్ 3 జనం సాక్షి /  మండల పరిషత్ కార్యాలయంలో గత నెల రోజులుగా జరుగుతున్న సమస్యల పై స్థానిక దినపత్రికలల్లో  ప్రచురించబడుతున్న సమస్యలపై మండల అభివృద్ధి అధికారిగా తగు చర్యలు ఎందుకు తీసుకోవడం లేదని నేషనల్ హ్యూమన్ రైట్స్ కేసముద్రం మండల వర్కింగ్ ప్రెసిడెంట్ పానుగంటి విష్ణువర్ధన్ ప్రశ్నించారు.ఈ సందర్భంగా ఆయన ఎంపీడీవో రోజారాణి కి మెమోరాండం అందజేయడం జరిగింది.అనంతరం పత్రిక విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ… మండలం లో ఇంకుడుగుంతలు నిర్మాణాలు పూర్తిచేసిన కాంట్రాక్టర్ చందుకు పారదర్శకంగా న్యాయం చేయాలని ఆయన అన్నారు. అదేవిధంగా కంప్యూటర్ ఆపరేటర్ కాంట్రాక్టర్ల నుండి అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారని వాటికి సంబంధించిన ఫోన్ పే ఆధారాలు తమ వద్ద ఉన్నాయని ఈ ఘటనపై విచారణ జరిపి తదుపరి చర్యలు తీసుకుని బాధితులకు న్యాయం చేయాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు.అదేవిధంగా ఉపాధిహామీ అదనపు ప్రోగ్రామ్ అధికారిని నియమించి పధకం ధ్వారా ఉపాధి పనులను వేగవంతం చేయాలని అన్నారు.మండలంలోని భవానిగడ్డ తండాలో ఉపాధిహామీ కూలీ పోలు యాకయ్య కుటుంబానికి ప్రభుత్వం నుండి అందే ఎక్స్ గ్రేషియాను తక్షణమే అందించాలని ఆయన డిమాండ్ చేశారు.అంతే కాకుండా ఇంకుడుగుంతల పరిశీలనకు ప్రత్యేక సామాజిక తనికీ బృందాన్ని కేటాయించి వాస్తవాలను బయటపెట్టాలని ,ఉపాధిహామీ కార్యాలయంలో ఎం బుక్స్ నిర్వహణలో అధికారులు,సిబ్బంది నిర్లక్ష్యం పై శ్వేతపత్రం విడుదల చేయాలని అన్నారు. అదేవిధంగా మండలంలోని అన్ని గ్రామాలల్లోని ఉపాధిహామీ కూలీలకు పెండింగులో ఉన్న వేతనాలు విడుదల చేయాలని డిమాండ్ చేశారు.ఈ విషయం పై స్పందించిన ఎంపీడీవో ఉన్నతాధికారులదృష్టికి తీసుకెళ్లి బాధితులకు న్యాయం జరిగేలా చూస్తామని హామీ ఇచ్చారని తెలిపారు .కొందరు ప్రజాప్రతినిధులు. కొన్ని పత్రికల జర్నలిస్టులు సమస్యలపై పోరాడుతున్న నేషనల్ హ్యూమన్ రైట్స్ పై వ్యక్తిగతంగా ఇబ్బందులు పెడుతున్నారని ,కాసులకు కక్కుర్తి పడి అసలైన జర్నలిజానికి న్యాయం చేయడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో అధ్యక్షుడు కొనకటి మహేందర్ రెడ్డి ,ఉపాధ్యక్షుడు వనం విద్యాసాగర్,అమర్రాజు రాజు తదితరులు పాల్గొన్నారు.