మండల బిఎస్పీ పార్టీ అధ్యక్షులుగా పంది‌ జాన్

మునగాల, నవంబర్ 09(జనంసాక్షి): కోదాడ నియోజకవర్గ బహుజన సమాజ్ పార్టీ సమీక్ష సమావేశం బుధవారం పిల్లుట్ల శ్రీనివాస్ సహకారంతో మునగాల మండల నూతన అధ్యక్షుడుగా పంది జాన్ ను, కోదాడ నియోజకవర్గ ఈసీ మెంబర్లుగా తాడువాయి గ్రామానికి చెందినటువంటి కోట మన్మధుడు, తిమ్మారెడ్డిగూడెం గ్రామానికి చెందినటువంటి దైదా సురేందర్ ను నియమిస్తున్నట్లు నియోజకవర్గ అధ్యక్షులు కందుకూరు  ఉపేందర్ తెలిపారు. కోదాడలోనే పిల్లుట్ల శ్రీనివాస్ నివాసంలో జరిగిన బిఎస్పి పార్టీ ప్రత్యేక సమావేశంలో ఎన్నిక జరిగినట్లు ఆయన తెలిపారు. గతంలో విజయ రాఘవపురానికి చెందిన రెండాల లింగయ్య మండల కన్వీనర్ గా బాధ్యతలు కొనసాగుతుండగా, ఆయన ఉద్యోగరీత్యా వెళ్లడం వల్ల నూతన అధ్యక్షుడుగా జాను నియమిస్తున్నట్లు తెలిపారు. విద్యావంతుడు, బహుజన వాదం పట్ల ఆసక్తి ఉండటం వల్ల జాన్ ను నియోజకవర్గ అధ్యక్షులు కందుకూరు ఉపేందర్ తెలిపారు. ఈ సందర్భంగా మండల నూతన అధ్యక్షులు జాను మాట్లాడుతూ, మండల నూతన అధ్యక్షుడిగా బాధ్యతలు అప్పజెప్పిన బహుజన్ సమాజ్ పార్టీ జిల్లా ఇన్చార్జి రాష్ట్ర నాయకులు పిలుట్ల శ్రీనివాస్ కు, నియోజకవర్గ అధ్యక్షులు కందుకూరు ఉపేంద్రకు కృతజ్ఞతలు తెలిపారు. శక్తి మేరకు మునగాల మండలంలో పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని తెలిపారు. కోదాడలో నీలి జెండా ఎగిరే విధంగా శక్తివంచను లేకుండా పార్టీ కొరకు అహర్నిశలు కృషి చేస్తానని ఈ సందర్భంగా తెలిపారు. తన ఎన్నికకు సహకరించిన జిల్లా, నియోజకవర్గ, మండల, గ్రామశాఖ బహుజన సమాజ్ పార్టీ కార్యకర్తలకు నాయకులకు అందరికీ పేరుపేరున కృతజ్ఞతలు తెలిపారు