మండుతున్న ఇం‘ధనం’ వేళ..సర్కారు చల్లని కబురు

` ప్రయాణికుల కోసం 30 శాతం భారీ రాయితీ
` ఆర్టీసీ, మెట్రో డీలక్స్ బస్సుల్లో అమలు
` రాష్ట్రంలో పెట్రోల్, డీజిల్ కొరత లేదు..
` సోషల్ విÖడియా పుకార్ల కారణంగా 25శాతం డిమాండ్ పెరిగింది
` డిమాండ్‌కు తగ్గ సరఫరా జరుగుతోందని వెల్లడి
హైదరాబాద్(జనంసాక్షి):పశ్చిమాసియాలో యుద్ధ పరిస్థితుల నేపథ్యంలో తలెత్తిన ఇంధన కొరత దష్ట్యా, నగర వాహనదారులకు ఊరటనిచ్చేలా తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ కీలక నిర్ణయం తీసుకున్నట్లుగా టీజీఎసఆర్టీసీ ఎండీ నాగిరెడ్డి తెలిపారు. పెట్రోల్ బంకుల వద్ద గంటల తరబడి వేచిచూస్తున్న సామాన్యుడి కష్టాలను గమనించి, సౌకర్యవంతమైన ప్రయాణాన్ని తక్కువ ధరకే అందించేందుకు ఆర్టీసీ సిద్ధమైంది. హైదరాబాద్ పరిధిలోని మెట్రో ఏసీ, మెట్రో డీలక్స్ బస్సుల్లో టికెట్ ధరలపై 30 శాతం రాయితీని కల్పిస్తున్నట్లు సంస్థ ఎండీ వై.నాగిరెడ్డి ప్రకటించారు. ఈ మేరకు నగరవాసులు ఈ సేవలను వినియోగించుకోవాలని ఆయన కోరారు.
ఆర్టీసీ సేవలను సద్వినియోగం చేసుకోండి : పెట్రోల్తో ఇబ్బందులు పడటం ఎందుకు దండగ, ఆర్టీసీ బస్సులు ఉండగా! తమ బస్సుల్లో ప్రయాణించండని ఎండీ నాగిరెడ్డి ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈ కీలక నిర్ణయం వెనుక ఉన్న నాలుగు ప్రధాన ప్రయోజనాలను ఆయన వివరించారు. దీనివల్ల ప్రయాణికులకు సమయం, ఇంధనం ఆదా అవుతుందని ఆయన పేర్కొన్నారు. పెట్రోల్ కోసం కిలోవిÖటర్ల మేర క్యూలైన్లలో నిలబడి విలువైన సమయాన్ని వథా చేసుకోవద్దని నాగిరెడ్డి సూచించారు. వ్యక్తిగత వాహనాల కోసం గంటల తరబడి వేచి చూసే బదులు, క్షేమంగా, వేగంగా గమ్యస్థానాలకు చేరడానికి ఆర్టీసీ బస్సులే మేలని పేర్కొన్నారు.
రాష్ట్రంలో పెట్రోల్, డీజిల్ కొరత లేదు : రాష్ట్రంలో పెట్రోల్, ఎల్పీజీ, డీజిల్ కొరత లేదని ప్రభుత్వం స్పష్టం చేసింది. వచ్చే రెండు నెలలకు సరిపడా ఇంధన నిల్వలు ఉన్నాయని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. సోషల్ విÖడియాలో పుకార్ల ప్రచారం కారణంగా పెట్రోల్ డిమాండ్ 25శాతం పెరిగిందన్నారు. డిమాండ్కు తగ్గట్లుగా సరఫరా జరుగుతోందని ప్రజలు ఎలాంటి ఆందోళనకు గురికావాల్సిన అవసరం లేదని వివరించారు.
పెట్రోల్, డీజిల్ కత్రిమ కొరత సష్టిస్తే కఠిన చర్యలు : హైదరాబాద్లో నగరంలో పెట్రోల్, డీజిల్ కొరత ఉందనే పుకార్లు వినిపిస్తున్నవేళ అధికారులు చర్యలు చేపట్టారు. అలాంటి పుకార్లను నమ్మవద్దని నగర సీపీ సజ్జనార్ ప్రజలకు సూచించారు. ఎవరైనా నిబంధనలు అతిక్రమించి పెట్రోల్, డీజిల్ కత్రిమ కొరత సష్టించినట్లయితే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆయన తెలిపారు. రాష్ట్రంలో 60 రోజులకు సరిపడా పెట్రోల్ నిల్వలు ఉన్నాయని అని వెల్లడించారు. ఎవరు కూడా అపోహలను నమ్మవద్దని హితవు పలికారు. మరోవైపు సోషల్ విÖడియాలో కూడా వస్తున్న వార్తలపై నిఘా పెట్టినట్లుగా ఆయన పేర్కొన్నారు. హైదరాబాద్లో 186 బంకుల వద్ద పరిస్థితిని సవిÖక్షిస్తున్నామని సజ్జనార్ తెలిపారు.
అపోహలను నమ్మి ఇబ్బందులకు గురికావొద్దు : పెట్రోల్ కొరత ఉందన్న అపోహలపై హైదరాబాద్ కలెక్టర్ హరిచందన కూడా స్పందించారు. పెట్రోల్, డీజిల్ కొరత ఉందనే పుకార్లను నమ్మి ఇబ్బంది పడవద్దని ఆమె నగరవాసులకు సూచించారు. సోషల్ విÖడియాలో వచ్చే కథనాలను ప్రజలు నమ్మవద్దని కోరారు. హైదరాబాద్లో సీపీ సజ్జనార్తో కలిపి ఆమె అధికారులతో సవిÖక్షా సమావేశం నిర్వహించినట్లుగా తెలిపారు. సోషల్ విÖడియాలో అవాస్తవాలను ప్రచారం చేసేవారిని గుర్తించి కఠిన చర్యలు తీసుకోనున్నట్లుగా వెల్లడించారు.
రద్దీ మాత్రం తగ్గడం లేదు : మంత్రులు, అధికారులు ఎన్ని రకాలుగా విజ్ఞప్తి చేసినా ప్రజల్లో పెట్రోల్ భయం మాత్రం తగ్గడం లేదు. రాబోయే రోజుల్లో సమస్య మరింత తీవ్రం అవుతుందన్న భయాలు, సోషల్ విÖడియాలో జరుగుతున్న ప్రచారం చూసి చాలామంది అవసరం లేకున్నా ఎక్కువ పెట్రోల్ కొనుగోలు చేస్తున్నారు. పెట్రోల్ బంకుల అసోసియేషన్ కూడా ఇదే విషయం నిర్దారించింది. సోషల్ విÖడియాలో జరుగుతున్న ప్రచారం వల్ల మంగళవారం 3 రెట్లు ఎక్కువ పెట్రోల్ విక్రయం జరిగిందని తెలిపారు.