మంత్రాల నెపంతో మహిళపై దాడి

మల, మూత్రాలు తాగించిన గ్రామస్థులు

శంషాబాద్‌: రంగారెడ్డి జిల్లా శంషాబాద్‌ పరిధిలోని పిల్లుంగూడలో మంత్రాల నెపంతో ఓ మహిళపై గ్రామస్థులు దాడి చేశారు. మహిళకు గుండు గీయించిన గ్రామస్థులు ఆమెతో మల ,మూత్రాలు తాగించారు. బాధితురాలి కుమారుడి ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదుచేశారు. నలుగురిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.