మంత్రిగానైనా ఉండు.. వీధి రౌడీగానైనా ఉండు

లేదంటే రెంటికి చెడ్డ రేవడవుతావు
దానంపై నారాయణఫైర్‌
హైదరాబాద్‌, ఆగస్టు 11 (జనంసాక్షి): ఆలయ వివాదం లో చిక్కుకున్న మంత్రి దానం నాగేందర్‌ వీధి రౌడీలా ప్రవర్తిస్తున్నారని ,నాగేంద్రర్‌ మంత్రా లేక రౌడియా అని పేర్కోన్నారు,రెండు పాత్రలు పోషిచడం దానంకు గౌరవం కాదని సీపీఐ కార్యదర్శి నారాయణ శనివారంనాడు మీడియాతో అన్నారు. ఏవైనా సమస్యలుంటే మంత్రివర్గంలో చర్చించాలే గాని, అలా ప్రవర్తించకూడదన్నారు. దేవాలయాలకు గేట్లకు తాళాలు వేయడం మంచి సంప్రదాయం కాదని చెప్పారు. ఇప్పటికైనా కేసుల్లో ఉన్న మంత్రులందర్నీ సాగనంపితేనే ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌ రెడ్డికి గౌరవం దక్కుతుందని, లేకపోతే ఆయనే బలి కావాల్సి ఉంటుందని తెలిపారు. రాష్ట్రానికి చెందిన గ్యాస్‌పై ఎంపీలు పోరాడాల్సిందేనన్నారు. వినతి పత్రం ఇచ్చినంత మాత్రాన ఫలితం ఉండదన్నారు. పోరాటం చేస్తేనే మన గ్యాస్‌ మనకు వస్తుందని చెప్పారు. వర్షాభావం వల్ల కొన్ని ప్రాంతాల్లోని రైతులు నేటికీ పంటలు వేయలేకపోయారని, వారికి కనీసం వాణిజ్య పంటలపైనైనా అవగాహన కల్పించాలని డిమాండు చేశారు. పరిశోధనలు చేయడంలో వ్యవసాయ విశ్వవిద్యాలయం విఫలమైందన్నారు. నేటీ వరకు విసిని నియమించక పోవడం దారుణమైన విషయమన్నారు. తెలంగాణకు గ్యాస్‌ అందించేలా కృషి చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. సంపదతో కూడిన తెలంగాణనే తాము ఆహ్వానిస్తామని, అంతకుమించి తమకేమీ వద్దని తెలిపారు.