మంత్రి ఎర్రబెల్లి సమక్షంలో బీఆర్‌ఎస్‌లో చేరికలు

మహబూబాబాద్‌  జనం సాక్షి :

బీఆర్‌ఎస్‌లోకి వలసల పర్వం కొనసాగుతూనే ఉంది. అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులై వివిధ పార్టీల నుంచి స్వచ్ఛందంగా బీఆర్‌ఎస్‌లో చేరుతున్నారు. తాజాగా జిల్లాలోని పెద్ద వంగ‌ర మండ‌లం కొరిపెల్లి గ్రామానికి చెందిన కాంగ్రెస్ నాయకులు డోనాల క‌రుణాకర్,ఎర్ర నర్సయ్య తోపాటు, తొర్రూరు మండ‌లం పెద మంగ్యా తండాకు చెందిన వార్డు మెంబర్‌ జాటోత్ దేవా, జాటోత్ జితేందర్, జాటోత్ నిమ్మ, జాటోత్ నారాయణ, జాటోత్ హేమని, జాటోత్ నంద కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌ రావు స్వగ్రామం వరంగల్‌ జిల్లాలోని పర్వతగిరిలో బీఆర్‌ఎస్‌లో చేరారు. వారికి గులాబీ కండువాలు కప్పి మంత్రి పార్టీలోకి ఆహ్వానించారు.అలాగే తొర్రూరు మండ‌లం పోలేపల్లి గ్రామానికి చెందిన 15 కాంగ్రెస్ కుటుంబాలు బీఆర్ఎస్ లో చేరాయి. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..సీఎం కేసీఆర్‌ పానలో జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులై బీఆర్‌ఎస్‌లో చేరామన్నారు. వచ్చే ఎన్నికల్లో మంత్రి ఎర్రబెల్లిని భారీ మెజార్టీతో గెలిపిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ తూర్పాటి చిన్న అంజయ్య, జెడ్పిటిసి మంగళ పల్లి శ్రీనివాస్, పసుమర్తి సీతారాములు, రామ సహాయం కిశోర్ రెడ్డి, కాకిరాల హరిప్రసాద్, పులి వెంకన్న, ధ‌రావత్ భాస్కర్, పులి సతీష్, తదితరులు పాల్గొన్నారు.

తాజావార్తలు