మంత్రి కాల్వతో జర్నలిస్ట్ యూనియన్ నేతల భేటీ
సమస్యలపై మంత్రికి వినతిపత్రం
నెల్లూరు,జూన్30(జనం సాక్షి): దళిత తేజం తెలుగుదేశం కార్యక్రమంలో పాల్గొనేందుకు జిల్లాకు వచ్చిన మంత్రి కాల్వశ్రీనివాసులును ఎపిడబ్ల్యుజెఎస్ యూనియన్ నేతలు కలిసి శనివారం వినతిపత్రం అందించారు. కలెక్టరేట్‌లోని గోల్డెన్ జూబ్లీ హాల్‌లో గఅహ నిర్మాణ రివ్యూ విూటింగ్ అనంతరం, వినతిపత్రంఇచ్చారు. లేఖలో… జిల్లాలో వివిధ రకాల పత్రికల్లో, ఛానల్లో పనిచేస్తున్న జర్నలిస్టులకు నాన్ లోకల్ పత్రికలకు ఛానల్సు అక్రిడేషన్ ఇవ్వలేదని దీనిపై కలెక్టర్‌ని, డిడిని కూడా కలిశామని, వారు ఈ విషయమై ఏమి న్యాయం చేయలేదని, ఈ విషయంపై మంత్రి స్పందించాలని కోరారు. జర్నలిస్టు వృత్తి చేసుకుంటూ జీవనం గడుపుతున్న మాకు ఇది చాలా బాధాకరమని, మాకు అక్రిడేషన్ మంజూరుకు సహకారం అందించాలని కోరారు. దీనిపై మంత్రి సానుకూలంగా స్పందించి కలెక్టర్‌తో మాట్లాడి న్యాయం జరిగేలా చేస్తానని హావిూ ఇచ్చారు. కార్యక్రమంలో ఎస్‌కె. మహమ్మద్ కాసీం, రాష్ట్ర ఉపాధ్యక్షులు కె. ప్రసాద్, నెల్లూరు జిల్లా అధ్యక్షుడు వెంకటా చలపతి , ప్రధాన కార్యదర్శి సిహెచ్ వి. కృష్ణ , విూడియా ఇంచార్జ్ ఓ.రవీంద్ర నాయుడు , ఉపాధ్యక్షుడు ఇలియాస్ అహ్మద్, కార్యదర్శి జి.కేశవ నారాయణ, కృష్ణ కుమార్‌లు పాల్గొన్నారు.