మంత్రి కొప్పుల,ఎమ్మెల్యే కోరు కంటి చందర్ అనుచరులపై చర్యలు తీసుకోవాలి.

బిజెపి జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణ శంకరపట్నం,ఆగస్టు 29( జనం సాక్షి ).
రామగుండం ఎరువుల ఫ్యాక్టరీ లో ఉద్యోగాలు కల్పిస్తామని మంత్రి కొప్పుల ఈశ్వర్,రామగుండం ఎమ్మెల్యే కోరు కంటి చందర్,అనుచరులు డబ్బుల వసూల్ పాల్పడిన ఈ సంఘటనపైసమగ్ర విచారణ చేయాలని. బిజెపి జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి అన్నారు. శంకరపట్నం మండలంకేశపట్నం లో సోమవారం బిజెపి మండల శాఖ ఆధ్వర్యంలో నిరసన దీక్ష చేపట్టారు. ఈ దీక్షలో ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం రైతులకు,వ్యవసాయం కోసం రామగుండం ఎరువుల ఫ్యాక్టరీ పున ప్రారంభిస్తే టిఆర్ఎస్ నాయకులు 700 మంది వద్ద ఉద్యోగాలు కల్పిస్తామని వసూళ్లకు పాల్ప డ్డారు అని ఆరోపించారు.ఉద్యోగం కోసం డబ్బులు ఇచ్చి మోస పోయిన అంబాలపూర్ గ్రామానికి చెందిన ముంజ హరీష్ ఆత్మహత్యకు పాల్పడ్డారని అన్నారు. ఆత్మహత్య చేసుకున్న హరీష్ కుటుంబానికి యాభై లక్షల పరిహారం, పిల్లల చదువు, ఉద్యోగం కల్పించాలని డిమాండ్ చేశారు.మంత్రి కొప్పుల ఈశ్వర్,రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ పై ముఖ్యమంత్రి కేసీఆర్ చర్యలు తీసుకోవాలని అన్నారు.700 మంది బాధితుల పక్షాన బిజెపి అండగా ఉంటుంది. పోరాటం చేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు చల్ల ఐలయ్య, జిల్లా నాయకుడు మాడ వెంకటరెడ్డి, అలివేలు సమ్మిరెడ్డి, గుర్రాల వెంకటరెడ్డి, నియోజకవర్గ ఇన్చార్జిగడ్డం నాగరాజు, వోరేమ్ జయచందర్, మంజుల వాణి, ప్రవీణ్, లోకేష్, స్వామి, కుమార్,ఎం పి టి సి ఏనుగు అనిల్, దండు కొమురయ్య,ఎలుకపెల్లి సంపత్, శ్రీకాంత్, సాగర్, వెంకటలక్ష్మి,అశోక్, చుక్కల శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.