మంత్రి జోగు, ఎమ్మెల్యే ఎర్రబెల్లిలకు శుభాకాంక్షలు
ఆదిలాబాద్,జూలై4(జనం సాక్షి ): రాష్ట్ర మంత్రి జోగు రామన్న, పాలకుర్తి ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్‌రావుల పుట్టినరోజు కావడంతో వారిని పలువురు అభినందించారు. మంత్రి జోగు రామన్న 55వ జన్మదిన వేడుకలను ఆదిలాబాద్‌లో పట్టణంలో ఘనంగా నిర్వహించారు. కుటుంబ సభ్యులతో కలిసి మంత్రి సాయిబాబా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేదపండితులు మంత్రి దంపతులనుఆశీర్వదించారు. కుటుంబ సభ్యుల మధ్య కేక్ కట్ చేసిన మంత్రి పాఠశాల విద్యార్థులకు మొక్కలను పంపిణీ చేశారు. జనగామ జిల్లా పాలకుర్తిలో తన జన్మదినం సందర్భంగా ఎమ్మెల్యే దయాకర్‌రావు రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు.