మంత్రి దానంపై కేసు నమోదుకు ఆదేశించిన కోర్టు

హైదరాబాద్‌, జనంసాక్షి: మంత్రి దానం నాగేందర్‌పై కేసు నమోదు చేయాలని నాంపల్లి కోర్టు బంజారాహిల్స్‌ పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది. న్యాయవాదిపై దాడి చేసిన ఘటనలో కేసు నమోదు చేయాలని ఆదేశించారు. ఐపీసీ 147, 148,149,160,307,323,427,506 సెక్షన్ల కింద నమోదు చేయాలని కోర్టు ఆదేశాలు జారీ చేసింది.