మంత్రి నిరంజన్ రెడ్డి గారి సమక్షంలో చేరికల జోరు ఖాళీ అవుతున్న బీజేపీ, కాంగ్రెస్
మంత్రి నిరంజన్ రెడ్డి గారి సమక్షంలో చేరికల జోరు ఖాళీ అవుతున్న బీజేపీ, కాంగ్రెస్
వనపర్తి బ్యూరో నవంబర్06 (జనంసాక్షి)
జరిగిన అభివృద్ధి ప్రజల కండ్ల ముందు ఉండడంతో బీజేపీ, కాంగ్రెస్ పార్టీల నుండి నాయకులు స్వచ్ఛందంగా బీఆర్ ఎస్ పార్టీలోకి వచ్చి చేరుతున్నారని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు. గోపాల్ పేట మండలం పోల్కేపహాడ్ గ్రామానికి చెందిన బిజెపి , కాంగ్రెస్ పార్టీల నుండి 140 మంది నాయకులు జెడ్పిటిసి మంద భార్గవి కోటేశ్వర్ రెడ్డి, మండల పార్టీ అధ్యక్షుడు కోదండం ఆధ్వర్యంలో, అంతకుముందు ఖిల్లా ఘనపురం మండలం షాపూర్ ఆముదం బండ తండాకు చెందిన కాంగ్రెస్ , బీజేపీ పార్టీల నుండి 30 మంది, జిల్లా కేంద్రంలోని 21వ వార్డుకు చెందిన డి.తిరుపతయ్య, అనిల్ కుమార్ ఆధ్వర్యంలో 80 మంది కాంగ్రెస్, బీజేపీ పార్టీల నుండి, 14 వ వార్డు కు చెందిన స్వర్ణ కారులు మోహనాచారి ఆధ్వర్యంలో వివిధ పార్టీల నుండి 40 మంది, 19 వ వార్డు కౌన్సిలర్ చంద్రకళ కృష్ణ యాదవ్ ఆధ్వర్యంలో బీజేపీ కాంగ్రెస్ పార్టీల నుండి 120 మంది నాయకులు వేరువేరుగా జిల్లా కేంద్రంలోని మంత్రి నివాసగృహంలో ఆదివారం రాత్రి రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి సమక్షంలో బీఆర్ ఎస్ పార్టీలో చేరారు. ముందుగా వారికి పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. పాత కొత్త నాయకులు అందరు కలిసి పని చేయాలని మంత్రి నిరంజన్ రెడ్డి సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రతి పథకం గురుంచి ప్రజలకు ఒక్కసారి గుర్తు చేయాలని అదేవిధంగా బిఆర్ ఎస్ మ్యానిఫెస్టోలో పొందు పరిచిన అంశాలను పూర్తి స్థాయి లో వివరించాలన్నారు. పోల్కేపహాడ్ నుండి పార్టీలో చేరిన వారిలో వడ్డెమాన్ రాజు, వి.వెంకటస్వామి, వి. ఎల్లస్వామి, సుజ్జి, ఎండి మంజూర్, మండ్ల శివ, బొగ్గు నరేందర్,జి. శివ, యాదగిరి, కురుమూర్తి, చెన్నయ్య, ఎన్. జగదీష్, ఎస్ రాజేష్, మిద్దె కురుమూర్తి, మిద్దె బాబు, ఎండి సిరాజ్, ఎండి మహమూద్, కార్తీక్ , నరేందర్ గౌడ్ తో పాటు తదితరులు ఉన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ చైర్మన్ లోకనాథ్ రెడ్డి, జిల్లా అధ్యక్షుడు గట్టు యాదవ్, జిల్లా అధికార ప్రతినిధి వాకిటి శ్రీధర్, రీజినల్ అథారిటీ సభ్యులు ఆవుల రమేష్, మార్కెట్ కమిటీ చైర్మన్ రమేష్ గౌడ్, బీ ఆర్ ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు గాజుల కోదండం, మండల ఎస్సీ సెల్ అధ్యక్షుడు వడ్డెమాన్ రవి, జెన్ కో రిటైర్డ్ ఎస్ ఈ మంద తిరుపతి రెడ్డి, నాయకులు మంద కోటీశ్వర్ రెడ్డి, వర్నెరాజు , మునీంద్ర ,చంద్రాయుడు , రాములు, నాగయ్య, పులేంధర్ ,బంగారయ్య, మల్లయ్య, నరేందర్ తదితరులు పాల్గొన్నారు.