మంత్రి సారయ్య కాన్వాయ్‌లోని వాహనం బోల్తా
ఆదిలాబాద్: జిల్లా ఇంచార్జీమంత్రి సారయ్య మందమర్రీలో ఓ కార్యక్రమంలో పాల్గొనడానికి వస్తున్నారు. అయితే మంత్రి కాన్వాయ్ మార్గమద్యంలో మంచిర్యాల మండలం రాపల్లి సమీపంలో ప్రమాదానికి గురైంది. కాన్వాయ్‌లోని ఓ వాహనం బోల్తపడటంతో 6గురుకి గాయాలయ్యాయి. వెంటనే సమీప ఆసుపత్రికి తరలించారు.