మంత్రి హరీశ్ రావు సమక్షంలో బిఆర్ఎస్ పార్టీలో చేరిన కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అభిలాష్ రావు, ఇతర నాయకులు

తెలంగాణ భవన్ లో మంత్రి హరీశ్ రావు సమక్షంలో బిఆర్ఎస్ పార్టీలో చేరిన కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అభిలాష్ రావు, ఇతర నాయకులు.  రాష్ట్రంలో ఏమూలకు పోయినా, ఎవ్వరిని అడిగినా మళ్లా వచ్చేది బిఆర్ఎస్ సర్కారు అంటున్నారు.
ఇందులో ఎవ్వరికి అనుమానం లేదు. ఎవరు ఎన్ని ట్రిక్కులు చేసినా హ్యాట్రిక్కు కొట్టేది బిఆర్ఎస్
కానే కాదన్న తెలంగాణను సాధించి చూపెట్టింది కేసీఆర్
రైతు బంధు, రైతు బీమా ఇలా అనేక కార్యక్రమాలు అమలు చేసింది కేసీఆర్
ప్రతి ఇంటికి నల్లా పెట్టి నీళ్లు ఇచ్చి చూపింది కేసీఆర్
చెప్పిన ప్రతి మాట నిలబుట్టుకున్నారు
నాగర్ కర్నూల్ కు మెడికల్ కాలేజీ వస్తుందని కలలో కూడా అనుకోలేదు
ఒక్క ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకు 5 మెడికల్ కాలేజీలు వచ్చాయి
కల్వకుర్తి ప్రాజెక్టుకు కాంగ్రెస్ వాళ్లు కొబ్బరి కాయలు కొడితే తెలుగు దేశం వాళ్లు మొక్కలు నాటారు
తెలుగుదేశం వాళ్లు కొబ్బరికాయలు కొడితే ఆ శిలాఫలకాల దగ్గర కాంగ్రెస్ వాళ్లు మొక్కలు నాటారు. నీళ్లు మాత్రం రాలేదు
ప్రాజెక్టును పూర్తి చేసి మూడున్నర లక్షల ఎకరాలకు నీల్లు ఇచ్చింది బిఆర్ఎస్ ప్రభుత్వం మాత్రమే.
కాంగ్రెస్ పాలనలో తాగడానికి నీళ్లు లేవు, రోడ్లు లేవు
కల్వకుర్తికి వంద పడకల ఆసుపత్రి వచ్చిందంటే కేసీఆర్ వల్లే
శ్రీశైలం ముంపు బాధితులకు జీవో కూడా మా వల్లే వచ్చింది
కాంగ్రెస్ వాళ్లవన్నీ ఉత్తిత్తి డిక్లరేషన్, ఎందుకు పనికిరాని డిక్లరేషన్
కర్ణాటకలో గెలిచి అక్కడ ఇచ్చిన హామీలు అమలు చేయడం లేదు
ఖర్గేగారు కర్ణాటక రాష్ట్రం. ఇచ్చిన హామీలు అమలు చేయలేదు
ఎలాగో అధికారంలోకి రాము అని ఇష్టం వచ్చినట్లు వాగ్ధానాలు ఇస్తున్నారు
2009 ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పినవి ఒక్కటి అమలు చేయలేదు కాంగ్రెస్
తండాలు గ్రామపంచాయతీలు అన్నారు, 9 గంటల కరెంట్ పగటి పూట ఇస్తం అన్నరు, సిలిండర్ ధర తగ్గిస్తం అన్నరు.
మేనిఫెస్టోలో చెప్పకపోయినా ప్రజలకు ఏమి కావలో చేసే నాయకుడు కేసీఆర్
కళ్యాణ లక్ష్మీ, బీడీ కార్మికులకు పింఛన్, మిషన్ భగీరథ, రైతు బంధు, రైతు బీమా.. ఇలా చెప్పనివి అనేకం అమలు చేశారు.
కొల్లాపూర్ అభివృద్ధి బిఆర్ఎస్ పార్టీ వల్లనే సాద్యం.
పాలమూరు ఎత్తిపోతల పథకం త్వరలో ప్రారంభించబోతున్నాం.
నాగర్ కర్నూల్ జిల్లా సస్యశామలం అవుతుంది
దళితులు, గిరిజనుల మీద ప్రేమ ఉన్నట్లు కాంగ్రెస్ నటిస్తున్నది.
వారి వెనుకబాటుతనానికి కారణమే కాంగ్రెస్ పార్టీ
అంబేద్కర్ ను ఓడించిన పార్టీ కాంగ్రెస్, చనిపోయిన తర్వాత కూడా భారత రత్న ఇవ్వని పార్టీ
బాబుజగజ్జీవన్ ప్రధాని కాకుండా అడ్డుకున్న పార్టీ కాంగ్రెస్
ముసలి కన్నీరు కాంగ్రెస్ కారుస్తున్నది
దళితుల కోసం వైన్స్, కాంట్రాక్టులు, ప్రభుత్వ పనుల్లో రిజర్వేషన్లు తెచ్చారు. దళిత బంధు వంటి అద్భుతమైన పథకం ప్రారంభించారు.
తండాలు పంచాయతీలు చేశారు, 10 శాతం రిజర్వేషన్లు అమలు చేశారు గిరిజనుల కోసం
గంటలకు ఎకరం పారుతుందట, మూడు గంటలు ఇస్తే మూడు గంటలు పారుతుందని రేవంత్ రెడ్డి అంటున్నడు
ఆనాడు ఉచిత కరెంట్ అని ఉత్త కరెంట్ చేశారు. రాజశేఖర్ రెడ్డి, రోశయ్య, కిరణ్ కుమార్ రెడ్డి ఉన్నప్పుడు కరెంట్ కష్టాలు
ఎట్ల సాధ్యమైతది నిరంతర కరెంట్ అన్నరు. చేసి చూపింది కేసీఆర్
రైతు బంధు, రైతు బీమా, ఉచిత కరెంట్ ఇలా సీఎం గారు అనేక కార్యక్రమాలు అమలు చేస్తున్నారు.
అందరూ కష్టపడి హర్షవర్ధన్ ను గెలిపించి, బీఆర్ఎస్ పార్టీని బలోపేతం చేయాలని మనవి చేస్తున్నాను.
ఎన్నికలు అయ్యాక కాదు, ఎన్నికల ముందు కూడా విజయోత్సవ ర్యాలీకి వస్తా.
మహబూబ్ నగర్ లో 14కు 14 గెలిచి చూపిద్దాం.
వలసల జిల్లా నాడు, ఇప్పుడు వలసలు వాపస్ అయ్యాయి
పచ్చదనం పరుచుకున్నది. నాడు వ్యవసాయ కూలీలు లేని పరిస్థితి. నేడు ఇతర రాష్ట్రాల నుంచి కూలీలు పనుల కోసం ఇక్కడికి వస్తున్నారు.
రైతులకు శ్రీరామ రక్ష బీఆర్ఎస్ పార్టీ
తెలంగాణ తరహా పథకాలు కావాలని ఇతర రాష్ట్రాల వారు కోరుతున్నారు.
తెలంగాణ పథకాలు దేశానికే ఆదర్శం.
తెలంగాణలో ఎకరం అమ్మితే ఆంధ్రలో వంద ఎకరాలు వస్తయని చంద్రబాబు అన్నడు.
సీఎం కేసీఆర్ రైతు గౌరవం పెంచారు, తద్వారా రైతు చేతిలో ఉన్న భూమి పెరిగింది
రైతు గౌరవం పెంచిన కేసీఆర్ నాయకత్వం బలోపేతం చేయాలి