మంత్రులంతా ఓటమి దిశగా పయనం
కౌంటింగ్ కేంద్రం నుంచి వెళ్లిపోయిన రోజా
ఓటమిని అంగీకరిస్తూ పోస్ట్ ప ఎట్టిన రోజా
అమరావతి,జూన్4 (జనం సాక్షి) : ఏపీలో వన్‌సైడెడ్‌గా కూటమి అభ్యర్ధులు విజయం దిశగా దూసుకుపోతున్న వేళ వైసిపి శ్రేణుల్లో నిసతేజం ఆవరించింది. దాదాపుగా అన్ని జిల్లాల్లోనూ టీడీపీ`జనసేన`బీజేపీ కూటమి క్లీన్ స్వీప్ దిశగా వెళ్తోంది. ఇదిలా ఉంటే.. వైసీపీ మంత్రులు పోటీ చేస్తోన్న నియోజకవర్గాల్లో.. ఆ పార్టీకి పరాభవం ఎదురైంది. అందరు మంత్రులు ఓటమికి అంచున ఉన్నారు. ఇక నగరిలో మంత్రి ఆర్‌కే రోజా తన సవిూప టీడీపీ అభ్యర్ధి గాలి భానుప్రకాశ్‌పై ఓటమికి చేరువగా రెండో స్థానానికి పరిమితమైంది. టీడీపీ అభ్యర్ధి ముందంజలో ఉండగా.. రోజా ఓటమి దిశగా పయనిస్తున్నట్టు ట్రెండ్స్ చెబుతున్నాయి. ఈ తరుణంలో రోజా
తన ఓటమిని అంగీకరిస్తూ.. ఎక్స్ వేదికగా ఫలితాలపై ఆసక్తికర ట్వీట్ చేశారు. చిరునవ్వులు చిందిస్తున్న తన ఫోటోను పంచుకుంటూ.. ’భయాన్ని విశ్వాసంగా ఎదురు దెబ్బలను మెట్లుగా.. మన్నింపులను నిర్ణయాలుగా.. తప్పులను పాఠంగా నేర్చుకుని, మార్చుకునే వాళ్లే శక్తిమంతమైన వ్యక్తులుగా మారతారు’ అంటూ ఆ ఫోటోకి క్యాప్షన్ ఇచ్చారు. కాగా, ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ విూడియాలో వైరల్‌గా మారింది.
రెండు రౌండ్లు పూర్తవగానే రోజా ఇంటి బాట పట్టారు. వైసీపీలో ఎగిరెగిరి పడిన నేతల్లో రోజా ఒకరు. ఆమె నోటికి ఎవరైనా భయపడాల్సిందే. నియోజకవర్గానికి చేసిందేవిూ లేదు కానీ పార్టీకి మాత్రం అన్నీ తానయ్యారు. అంటే పార్టీని ముందుకు తీసుకెళ్లడంలో కాదు. అధినేత జగన్‌పై ఏ చిన్న విమర్శ వచ్చినా విరుచుకుపడటంలో.. విూడియా ముందు ప్రత్యక్షమై నోటికి పనిచెప్పే నేతల్లో కొడాలి నాని తర్వాత స్థానం రోజాదే. అలాంటి రోజా ఓటమి ముందుగానే ఫిక్స్ అయిపోయింది. ఆమెకసలు సీటే ఇవ్వొద్దని వైసీపీ నేతలంతా అధినేత వద్ద నెత్తీ నోరు కొట్టుకున్నారు. ఎవరి మాటా వినకుండా రోజాకు టికెట్ కేటాయించారు. ఇంకేముంది? అసలే టీడీపీ హవా పెద్ద ఎత్తున వీస్తోంది. పైగా రోజాకు సొంత పార్టీ నుంచి కూడా ఏ మాత్రం బలం లేదు. అంతా వ్యతిరేకమే. జే ట్యాక్స్ మాదిరిగా తన నియోజకవర్గమైన నగరిలో రోజా ట్యాక్స్ పెట్టారు. పెద్ద ఎత్తున డబ్బు వసూలు చేశారని ఆరోపణలు ఉన్నాయి. దందాలకు హద్దు లేకుండా పోయింది. అధికారం రోజాది.. పెత్తనం ఆమె అన్నలది. ఎన్ని ఆరోపణలు వెళ్లినా అధిష్టానం కూడా పట్టించుకోలేదు. రోజా విషయంలో కన్నెర్ర చేయలేదు. వెరసి రోజా దారుణ పరాజయం మూటగట్టుకున్నారు. దీంతో ఇక రోజా రాజకీయం జీవితం అయిపోయినట్టేనని చర్చ మొదలయ్యింది. వైసీపీ పరిస్థితే ఇప్పుడు ఎలా ఉంటుందో అంతు చిక్కడం లేదు. నిన్న మొన్నటి వరకూ అధికారాన్ని అడ్డుపెట్టుకుని కేసులు ముందుకు కదలకుండా అడ్డుకున్నారు. ఇప్పుడు ఇటు అసెంబ్లీ, అటు లోక్‌సభలో వైసీపీ దారుణ పరాజయం పాలైంది. ఇక విూదట కేంద్రం సపోర్ట్ కూడా ఉండదు. మొత్తవ్మిూద వైసీపీ అధినేతకు గడ్డుకాలమే.