మంత్రులు సహనమెందుకు కోల్పోతున్నారు

3

– కోదండరాంకు క్షమాపణ చెప్పండి

– ప్రొఫెసర్‌ హరగోపాల్‌

హైదరాబాద్‌,జూన్‌ 9(జనంసాక్షి): తెలంగాణ ఐకాస ఛైర్మన్‌ కోదండరామ్‌పై తెలంగాణ మంత్రులు చేస్తున్న దాడిని పౌరహక్కుల సంఘం ఖండించింది. తెలంగాణ ఉద్యమంలో కీలకపాత్ర పోషించిన కోదండరామ్‌పై మంత్రులు చేసిన విమర్శలపై ముఖ్యమంత్రి కేసీఆర్‌ క్షమాపణ చెప్పాలని ఆ సంఘం నేత హరగోపాల్‌ డిమాండ్‌ చేశారు. ఇష్టం వచ్చినట్లుగా విమర్శలుచేయడాన్ని సిఎం ఎలా సమర్థించుకుంటారని అన్నారు.గురువారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ… ప్రభుత్వం తప్పులను ఎత్తిచూపిన కోదండరాంపై మంత్రులు సహనం కోల్పోయి మాట్లాడటం సరికాదని, లోపాలను సరిదిద్దుకోవాల్సిన ప్రభుత్వం వ్యక్తిగత దూషణలకు దిగుతోందన్నారు. ప్రజాస్వామ్యంలో విమర్శలను సానుకూలంగా స్వీకరించి పనిచేయాల్సి ఉంటుందన్నారు. తెరాస ప్రభుత్వం రెండేళ్లలో చేస్తున్న తప్పులను ఎత్తిచూపిన కోదండరామ్‌పై మంత్రులు సహనం కోల్పోయి మాట్లాడటం సరికాదని  హితవు పలికారు. ప్రభుత్వం ప్రజల ఆకాంక్షల మేరకే పనిచేయాలన్నారు. కోదండరామ్‌ చేసిన విమర్శల్లోని వాస్తవాలను గ్రహించి లోపాలను సరిదిద్దుకోవాల్సిన ప్రభుత్వం వ్యక్తిగత దూషణలు చేయడంపై మండిపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వ లోపాలను టీజేఏసీ అధ్యక్షుడు ప్రొ. కోదండరాం ఎత్తిచూపితే… ఆయనపై రాష్ట్ర మంత్రులు వ్యక్తిగత దూషణలకు దిగడం సరికాదని  హరగోపాల్‌ పేర్కొన్నారు. ఉద్యమంలో కీలక భూమిక పోషించిన వ్యక్తిని తిట్టడం దారుణమని దీనిని తాము తీవ్రంగా పరిగణిస్తున్నామని అన్నారు.