మంథని నియోజకవర్గ ప్రజల కోసం ప్రత్యేక ప్యాకేజీని కేటాయించాలి
ఎమ్మెల్యే దుద్దిళ్ళ శ్రీధర్ బాబు డిమాండ్ – గోదావరి నీటి ప్రవాహాన్ని నీట మునిగిన దేవాలయాలను, వ్యవసాయ పొలాలను పరిశీలించిన ఏఐసిసి జాతీయ కార్యదర్శి మంథని ఎమ్మెల్యే శ్రీధర్ బాబు
మంథని, జనంసాక్షి : పెద్దపల్లి జిల్లా మంథనిలోని గోదావరి తీరంలో నీటి ప్రవాహాన్ని , నీట మునిగిన దేవాలయాలను, వ్యవసాయ పొలాలను ఏఐసీసీ జాతీయ కార్యదర్శి మంథని ఎమ్మెల్యే శ్రీ దుద్దిళ్ళ శ్రీధర్ బాబు పరిశీలించారు. అనంతరం శ్రీధర్ బాబు మాట్లాడుతూ…భారీవర్షాలు వరదల వల్ల రైతులకు, ప్రజలకు పెద్ద మొత్తంలో నష్టం వాటిల్లిందన్నారు. కరెంటు స్తంభాలు విద్యుత్ తీగలు నేలకొరిగాయన్నారు. మత్స్యకారుల బోట్లు వలలు వరదలలో కొట్టుకపోవడం వల్ల మత్స్యకారులు ఉపాధిని కోల్పోయారన్నారు. గొర్ల కాపరుల గొర్లు, పశువులు వరదలలో కొట్టుకపోయాయి ఈ భారీ నీటి ప్రవాహం వల్ల చాలా గ్రామాలలో ఇండల్లోకి వరద నీరు చేరి గోడలు,ఇండ్లు కూలిపోవడం జరిగిందన్నారు. నిత్యవసరాల వస్తువులు నీట మునిగాయయన్నారు. వరద నీటి ప్రవాహం వల్ల జరిగిన నష్టాన్ని రాష్ట్ర ప్రభుత్వం పెద్దపల్లి, భూపాల్ పల్లి జిల్లాలో ఉన్న గోదావరి పరివాహక ప్రాంతాల ప్రజలకు నష్టపరిహారం చెల్లించాలన్నారు. ప్రకృతి వైపరీత్యం మరియు మానవ కోణంలో అదుపు చేసే ప్రక్రియ ఎక్కడైనా తప్పిందో చూడాల్సిన అవసరం ఈ రాష్ట్ర ప్రభుత్వం పైన ఉందన్నారు. వరద నీటి వల్ల ఉపాధిని కోల్పోయిన వారికి, రైతు సోదరులకు, ఇల్లు కూలిపోయిన వారికి, వివిధ కులవృత్తుల వారికి నష్టం వాటిల్లింది నష్టపోయిన మంథని నియోజకవర్గ ప్రజల కోసం ప్రత్యేక ప్యాకేజీని ఏర్పాటు చేయాలని ఏఐసిసి జాతీయ కార్యదర్శి, మంథని ఎమ్మెల్యే శ్రీధర్ బాబు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.