మంథని ప్రజలు మార్పు కోరుకుంటున్నారు

కాంగ్రెస్, బి ఆర్ స్ తో మంథని ప్రాంత అభివృద్ధి శూన్యం
– అస్సాం థౌర ఎమ్మెల్యే సుశాంత్
జనంసాక్షి, మంథని :
పెద్దపల్లి జిల్లా మంథని పట్టణంలో ప్రవాసి ఎమ్మెల్యే సంపర్క్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసిన మంథని అసెంబ్లీ స్థాయి సమావేశం కన్వినర్ మల్కామోహన్ రావ్ గారి అధ్యక్షతన జరిగిన ముఖ్య అతిధులుగా అస్సాం థౌర ఎమ్మెల్యే సుశాంత్, జిల్లా ఇంచార్జ్ రావుల రాం నాథ్, పార్లమెంట్ కన్వినర్ మల్లికార్జున్,మాజీ ఎమ్మెల్యే చంద్రుపట్ల రాం రెడ్డి, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు చంద్రుపట్ల సునీల్ రెడ్డి, గొట్టిముకుల సురేష్ రెడ్డి ముఖ్య అతిధులుగా పాల్గొన్నారు. నాగేపల్లి గ్రామం నుండి పలువురు మహిళలు బీజేపీ పార్టీ లో చేరారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నాయకులు మాట్లాడుతూ.. మంథనిలో బీజేపీ గెలుపే మన లక్ష్యంగా ప్రతి ఒక్కరూ పని చేయాలి, మన భారతదేశానికి స్వతంత్రం వచ్చి 76 సంవత్సరాల కాలంలో దేశంలో ప్రజాస్వామ్య వ్యవస్థ మొదలైనప్పటి నుండి 1952లో ఒక్కసారి సోషలిస్ట్ పార్టీ అభ్యర్థి గులుకోట శ్రీరాములు గెలిచిన తర్వాత మంథని నియోజకవర్గంలో సింహం భాగం కాంగ్రెస్ నాయకులు పరిపాలించారని అన్నారు. మంథని నియోజకవర్గం అంటే పేరు గొప్ప ఊరు దిబ్బ అన్న చందంగా మారిందన్నారు.bఅమెరికాలో లక్షల్లో జీతం ఉన్న మంచి ఉన్నత పదవిని కాదని తెలంగాణ ప్రజల ఆకాంక్షను నెరవేర్చడానికి మంథని ప్రాంతానికి వచ్చి ఉద్యమం చేసిన సునీల్ రెడ్డి కి, తెలంగాణ జెండాను మంథని ప్రాంతంలో నలుదిశల వ్యాప్తిచేసిన రామ్ రెడ్డి కి తీవ్ర అన్యాయం కెసిఆర్ చేశారన్నారు. డబ్బుల కోసం టికెట్ను అమ్ముకొని ఉద్యమకారులను మోసం చేసిన పార్టీ టిఆర్ఎస్ పార్టీ అని ఆరోపించారు. విద్యావంతుడు, మంచి వ్యక్తిత్వం ఉన్న సునీల్ రెడ్డి కి ఒక అవకాశం ఇవ్వండి, మంథని ప్రాంతంలో అభివృద్ధికి బాటలు వేయండని అన్నారు.ఈ కార్యక్రమంలో జిల్లా అధికార ప్రతినిధి పోతారవేని క్రాంతికుమార్, కొ కన్వీనర్ నాంపల్లి రమేష్, పట్టణ అధ్యక్షులు బూడిద తిరుపతి, బి ఎస్ ఏ ఇంచార్జ్ చిలువేరి సతీష్, పోగ్రామ్ కన్వినర్ ఎడ్ల సదశివ్, మండల అధ్యక్షులు విరబోయిన రాజేందర్, బొమ్మన భాస్కర్, సిరిపురం శ్రీమన్నారాయణ, కోయాల్కర్ నిరంజన్, పిలుమారి సంపత్, మండలల ఇంచార్జ్ లు తోట మధుకర్, మచ్చగిరి రాము, ఉడుముల విజయరెడ్డి, మల్లారెడ్డి, సీనియర్ నాయకులు కొండపాక సత్య ప్రకాష్, రాపర్తి సంతోష్, తదితరులు పాల్గొన్నారు.