మంథని ప్రాంతానికి వరద రాకుండా శాశ్వత పరిష్కారం చేపట్టాలి – మంథని ఎమ్మెల్యే దుద్దిల్ల శ్రీధర్ బాబు
జనంసాక్షి, మంథని : మంథని చెక్ డ్యాం నుండి వర్షాలు, వరద నీరు రివర్స్ రావడము తో ప్రాంతానికి నష్టం జరుగుతున్నదని, వరద దాదాపు 1 .5 కిలోమీటర్ల వరకు నీరు వెళ్లి అక్కడ ఉన్న ఎల్ మడుగు వద్ద రెండు కొండలు మధ్య వెడల్పు తక్కువ ఉండటం వల్ల నీరు అక్కడి నుండి రివర్స్ వచ్చి మంథని టౌన్, ఎక్లస్ పూర్, ఖానపూర్ కు చాలా నష్టం వాటిల్లుతున్నదని, మళ్లీ వర్షాలు పడితే నష్టం జరిగే అవకాశం ఉన్నందున ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని, ప్రతి సంవత్సర ఈ పరిస్థితులు వస్తున్నoదున దీనికి ప్రభుత్వం శాశ్వత పరిష్కారం చేపట్టాలని మంథని ఎమ్మెల్యే దుదిల్ల శ్రీధర్ బాబు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మంథని చెక్ డ్యామ్ పరిశీలించడం తో పాటు ఏక్లాస్ పూర్, గోపాల్ పూర్, తదితర గ్రామాల్లో ముంపు ప్రాంతాల్లో శ్రీధర్ బాబు శుక్రవారం ప్రకటించారు. వరద నీరు మంథని టౌన్ కు చేరకుండా కరకట్ట నిర్మాణం చేసిన ఉపయోగం లేకుండా పోతున్నదని ఈఈ తో మాట్లాడి బొక్కల వాగు వరద నీరు మంథని టౌన్ లోకి రాకుండా శాశ్వత పరిష్కారం చేయాలని అధికారులకు సూచించారు. గత సంవత్సరం వరదల వల్ల నష్టపోయిన వారికి ఇల్లు కూలిపోయిన వారికి వెంటనే ప్రభుత్వం నష్టపరిహారం విడుదల చేయాలని శ్రీధర్ బాబు డిమాండ్ చేశారు.