మక్కరైతులను ఆదుకోవాలి
నాగర్‌కర్నూలు,నవంబర్22(జనంసాక్షి): రైతులు పండించిన మొక్కజొన్న ధాన్యాన్ని మార్క్‌ఫెడ్ అధికారులు పూర్తిస్థాయిలో కొనుగోలు చేయడంలేదని బీకేఎస్ జిల్లా అధ్యక్షుడు వెంకటయ్య ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుతం మొక్కజొన్న ధాన్యం కొనుగోళ్లలో దళారుల బెడదను అరికట్టి రైతులకు లబ్ధిచేకూర్చేలా చర్యలు తీసుకోవాలన్నారు. కరవు పరిస్థితులను అధిగమించి మొక్కజొన్న పంటను సాగు చేసిన రైతుల పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించడం తగదన్నారు. మక్కరైతులకు తక్షణం న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. నాగర్‌కర్నూల్ మార్కెట్‌యార్డులోని మొక్కజొన్న రైతులు కొనుగోళ్లు సరిగా
లేక నానాయాతనపడుతున్నారని, వారి సమస్యలను తెలుసుకోవాలని అన్నారు. గతంలో ఎన్నడూ లేనివిధంగా మొక్కజొన్న పంట పెట్టుబడులు పెరిగాయన్నారు. పెరిగిన పెట్టుబడులతో పోల్చితే రైతులకు ప్రభుత్వం చెల్లిస్తున్న గిట్టుబాటు ధరలు ఏమూలకు సరిపోవడంలేదన్నారు. దీన్ని దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం మొక్కజొన్న పంటకు గిట్టుబాటు ధరలను పెంచాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా రైతులు
పడుతున్న ఇబ్బందులపై మార్కెట్‌కార్యదర్శికి ఫిర్యాదు చేశారు.