మట్టి గణపతులే పర్యావరణహితం…… డిఇఓ యాదయ్య…..
తెలంగాణ రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి,రాష్ట్ర నేషనల్ గ్రీన్ కోర్ ఆధ్వర్యంలో విద్యార్థులకు ప్రత్యేక వర్క్ షాప్ లో శిక్షణ…..చిట్టి చిట్టి చేతులతో మట్టి గణపతి తయారుచేసిన చిన్నారులు…. అబ్బురపరిచి ఆకట్టుకున్న బాలవినాయకులు……..
……………………………………
రాష్ట్ర కాలుష్య నివారణ మండలి, తెలంగాణ రాష్ట్ర నేషనల్ గ్రీన్ కోర్ ఆధ్వర్యంలో మంగళవారం జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని మంచిర్యాల (బాలుర) ఉన్నత పాఠశాల పాఠశాలలో విద్యార్థులకు కాలుష్య రహిత బంకమట్టి వినాయక ప్రతిమలను తయారు చేసే విధానంపై వర్క్ షాప్ నిర్వహించి శిక్షణ ఇచ్చారు. బాలలు ఎంతో ఉత్సాహంగా చిట్టి చిట్టి చేతులతో మట్టి వినాయకులను తయారుచేసి ఆకట్టుకున్నారు. వినాయకులను ఎంతో ఉత్సాహంగా తయారు చేసిన చిన్నారులను డి.ఈ.ఓ మరియు ఇతర అధికారుల అభినందించారు. విద్యాశాఖ గ్రీన్ కోర్ జిల్లా కో.ఆర్డినేటర్ రాష్ట్ర శిక్షకులు గుండేటి యోగేశ్వర్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి ఎస్. యాదయ్య ,. మున్సిపల్ కమిషనర్ మారుతి ప్రసాద్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ కాలుష్య నివారణకై రాబోయే వినాయక చవితిని పురస్కరించుకొని విద్యార్థుల్లో అవగాహన కలిగించడానికి కార్యక్రమం చేపట్టమన్నారు. బంకమట్టి వినాయకులను పూజించి పర్యావరణ పరిరక్షణకు తోడ్పాటునవ్వాలని అన్నారు. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాల వలన పర్యావరణానికి హాని కలుగుతుందన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి రూపొందించిన గోడ ప్రతులను పి సి.బి ..గ్రీన్ కోర్ , విద్యాశాఖ అధికారులు ఆవిష్కరించారు. రాష్ట్ర ప్రాజెక్టు అధికారి విద్యాసాగర్.. గుండేటి యోగేశ్వర్,పిసిబి అధికారి కె. సత్తయ్య బంకమట్టి వినాయకుల తయారీపై విద్యార్థులకు శిక్షణ నిచ్చి బంకమట్టి విగ్రహాల ప్రాధాన్యతపై అవగాహన కలిగించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ. పి. ఓ.పి విగ్రహాలు నిమజ్జనం తర్వాత సుమారు మూడు నెలల వరకు నీటిలో అవక్షేపంగా ఏర్పడి జలచర జీవులకు, కలిసి తన్నీరు తాగిన ఇతర ప్రాణులకు మనుగడకు విఘాతం కలిగిస్తాయి అన్నారు. ఈ వినాయక చవితికి అందరూ సహజమైనటువంటి బంకమట్టివినాయకుని పూజించాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో విద్యాశాఖ సెక్టోరిల్ అధికారులు అధికారులు కే. చౌదరి, సత్యనారాయణమూర్తి, డి.ఎస్.ఓ మధుబాబు హెచ్.ఎం. వేణుగోపాల్, పిసిబి సిబ్బంది రాజశేఖర్ కుమారస్వామి, గ్రీన్ టీచర్స్ ఏ శ్రీనివాస వర్మ,ఆర్. రాజయ్య
పాఠశాల పర్యావరణ క్లబ్ విద్యార్థులు పాల్గొన్నారు