మట్టి రోడ్ పై వరి నాట్లు వేసి నిరసన

సూర్యాపేట ప్రతినిధి (జనంసాక్షి):తమ గ్రామానికి పక్కా రోడ్ వేయాలని కోరుతూ ఆత్మకూర్(ఎస్) మండలం దుబ్బతండా గ్రామస్తులు, జనసమితి కార్యకర్తలు శుక్రవారం ఆ గ్రామంలోని మట్టి రోడ్డుపై వరి నాట్లు వేసి తమ నిరసనను వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా టీజెఎస్ ఎస్టీ సెల్ జిల్లా ఉపాధ్యక్షులు జాతోత్ శ్రీను నాయక్ మాట్లాడుతూ స్వరాష్ట్రంలో కూడ దుబ్బతండా అభివృద్ధికి నోచుకోలేదన్నారు.గతంలో  కోటినాయక్ తండా నుండి డొంకలో మట్టి రోడ్ వేశారని అన్నారు.ఆ తరువాత ఈ రోడ్ ను అధికారులు గానీ , నాయకులు గానీ పట్టించుకోలేదన్నారు.ప్రతి రోజు స్కూళ్లు, కాలేజీలకు వెళ్లే విద్యార్థులు, కూలీ పనికి వెళ్ళే వారు వర్షం వస్తే ఈ దారి గుండా పోలేక తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని అన్నారు.వాహనదారులు కూడా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని  పేర్కొన్నారు.తక్షణమే పాలకులు, అధికారులు స్పందించి దుబ్బతండాకు పక్కా రోడ్ వేయాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో లుడియా, శంకర్ నాయక్ , మోహన్ , లింగా , బీకర్, హౌసన్, నాగులు,  సూర్య,  నర్సింహ, మల్సూర్ తదితరులు పాల్గొన్నారు.

తాజావార్తలు