మతసామరస్యానికి ప్రతీక రంజాన్‌

కరీంనగర్‌, ఆగస్టు 5 (జనంసాక్షి) : రంజాన్‌ మాసం ఆధ్యాత్మికంగానే కాకుండా, కులమతాల మధ్య భారతదేశంలో సఖ్యతకు చిహ్నమని చల్మెడ వైద్య విద్యా సంస్థల చైర్మన్‌ చల్మెడ లక్ష్మీనర్సింహారావు తెలిపారు. ఆదివారం కరీంన గర్‌లోని పద్మనాయక కల్యాణ మండపంలో ఆయన ముస్లింలకు ఇఫ్తార్‌ విందు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లా డుతూ రంజాన్‌ మాసంలో ముస్లింలు పాటించే దీక్షలు నిజంగా అభి నం ఠదనీయమన్నారు. మన దేశంలో ఏ పండుగనైనా అన్ని మతాల ప్రజలు కలిసిమెలిసి జరుపుకోవడం చూసి, విదేశీయులు ఆశ్చర్య పడుతుంటారని వివరించారు. దేశంలో ఎన్ని అనివార్య పరిస్థితులు వచ్చినా, హిందూ ముస్లింలు ఐక్యంగా ఉండి తమ ఐక్యతను చాటారన్నారు. ఈ సంప్రదాయం ముందు తరాల వారికి ఆదర్శనీయమని చల్మెడ అభివర్ణించారు. చల్మెడ విద్యా సంస్థల ఆధ్వర్యంలో చాలా ఏళ్లుగా ప్రతి రంజాన్‌ మాసంలో ఇఫ్తార్‌ విందును ఇస్తున్నామని, ఈసారి కూడా ముస్లింల గౌరవార్థం ఈ విందును ఏర్పాటు చేశామని తెలిపారు. విందుకు విచ్చేసిన ముస్లింలకు లక్ష్మీనర్సింహారావు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో ముస్లిం మత పెద్దలు, నాయకులు మాజీ డిప్యూటీ మేయర్‌ అబ్బాస్‌ సమీ, ఎంఐఎం జిల్లా అధ్యక్షుడు వహాజుద్దీన్‌, జిల్లా కార్యదర్శి సయ్యద్‌ గులాం అహ్మద్‌ హుస్సేన్‌, జనంసాక్షి మేనేజింగ్‌ డైరెక్టర్‌ షేక్‌ అబూబాకర్‌ ఖాలిద్‌, బర్కతుల్లా, ఖైరుద్దీన్‌, గులాం మహ్మద్‌, సలీం, కరీం, మోయిజుద్దీన్‌, మగ్దూం, ఫసి అహ్మద్‌ ఖాన్‌, రఘునందన్‌రావు, కోడూరి సత్యనారాయణగౌడ్‌, హర్ష మల్లేషం, అంజయ్యగౌడ్‌ తదితరులు పాల్గొన్నారు.