మతహింసను సహించం

MODI

పరమత సహనం రత్‌ డీఎన్‌ఏలో ఉంది

చర్చిలపై దాడులను ఖండించిన ప్రధాని

న్యూఢిల్లీ,ఫిబ్రవరి17(జనంసాక్షి): చర్చిలపై దాడులను ప్రధాని నరేంద్ర మోదీ తీవ్రంగా ఖండించారు. పరమత సహనం భారత్‌ అభిమతమన్నారు. అన్ని మతాలనూ తనలో కలుపుకొనే ఘనచరిత్ర భారత్‌దని ఆయన పేర్కొన్నారు. అన్ని మతాలకు పూర్తి స్వేచ్ఛ ఇచ్చే ప్రభుత్వం తమదన్నారు. దేశంలో మతపరమైన హింస, విద్వేషాలకు తావులేదని ఆయన స్పష్టంచేశారు. దాడులను ఎట్టి పరిస్తితుల్లోనూ సహించబోమన్నారు. ఇలాంటి వాటిని కఠినంగా అణచివేస్తామని అన్నారు. భారత్లో ఎలాంటి పరమత అసహనాన్ని సహించబోమని కఠినంగా హెచ్చరించారు. ఇదిలావుంటే హాంకాంగ్‌లో నిరంతరాయంగా 40గంటల్లో 1500 యోగా సనాలు చేసి గిన్నీస్‌ రికార్డుల్లోకెక్కిన యోగారాజ్‌కు ప్రధాని నరేంద్రమోడీ అభినందనలు తెలిపారు. జూన్‌ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవంగా ప్రకటించిన నేపథ్యంలో యోగాపై విస్తృత ప్రచారానికి విశేషంగా కృషి చేస్తున్న యోగారాజ్‌కు ప్రభుత్వం అండగా ఉంటుందని స్పష్టం చేశారు. ‘యోగాలో గిన్నీస్‌ రికార్డుల కెక్కిన తమిళనాడుకు చెందిన యోగారాజ్‌కు నా అభినందనలు. యోగా విశిష్టతను ప్రపంచానికి మరోసారి చాటి చెప్పిన యోగారాజ్‌కు ప్రభుత్వం ఎల్లవేళలా సహకారం అందిస్తుందని’ ట్విట్టర్‌లో ఓ సందేశాన్ని పోస్ట్‌ చేశారు. హాంకాంగ్‌ వేదికగా 29 ఏళ్ల యోగారాజ్‌ యోగాసనాలతో రికార్డు నమోదు చేసిన విషయం తెలిసిందే.