మత్స్యకారులందరు కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలి.
తాలూకా మత్స్య సహకార సంఘాల అధ్యక్షుడు వాకిటి ఆంజనేయులు.
-బీమి ఇన్సూరెన్స్ పై అవగాహన సదస్సు .
నాగర్ కర్నూల్ జిల్లా ప్రతినిధి,డిసెంబర్18(జనంసాక్షి ):
మత్స్య సహకార సంఘాల సభ్యులందరూ కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని కొల్లాపూర్ తాలూకా మత్స్య సహకార సంఘాల అధ్యక్షుడు వాకిటి ఆంజనేయులు పిలుపునిచ్చారు.ఆదివారం కొల్లాపూర్ పట్టణంలో గంగమ్మ గుడి ఆవరణంలో మత్స్య పరిశ్రమిక సహకార సంఘాల సభ్యుల మరణాల ఇన్సూరెన్స్ పై అవగాహన సదస్సు ఏర్పాటు చేయడం జరిగింది.ఈ సందర్భంగా వాకిటి ఆంజనేయులు మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం అందిస్తున్న ఇన్సూరెన్స్ బీమా పథకాలు,ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన (జిఏఐఎస్) వంటి అన్ని పథకాలను ఉపయోగించుకోవాలని సూచించారు.ఇవే కాకుండా ఈస్రాం,పోస్టల్ భీమా, రైతు బీమా,ప్రధానమంత్రి సురక్ష యోజన బీమా పథకం, జీవనజ్యోతి పథకం, ఎస్బిఐ జనరల్ పథకం,పార్టీల సభ్యత్వాలపై ఇన్సూరెన్స్ లు ఎలా వస్తుంది అనే దానిపై పూర్తిగా వివరణ ఇవ్వడం జరిగింది.ఈ కార్యక్రమంలో పెద్దకొత్తపల్లి,కొల్లాపూర్, కోడేరు, పెంట్లవెల్లి, నాలుగు మండలాల అధ్యక్షులు ఉపాధ్యక్షులు సెక్రెటరీలు
పేబ్బేటి కృష్ణయ్య,చెంది వెంకటస్వామి,
ముష్టిపల్లి పుట్ట మల్లేష్,కొత్తపేట కురుమయ్య,జనుంపల్లి సర్పంచ్, నరసాయిపల్లి నాగరాజు,బావా యిపల్లి సాయిరాజ్,ఎల్లూరు నక్క స్వామి,గుర్రం శ్రీనివాస్,పిట్టల సుధాకర్, గట్టుఆంజనేయులు,వెంకట స్వామి,
సొసైటీల సభ్యులు తదితరులు పాల్గొన్నారు.