మత్స్యకారుల అభివృద్దికి కట్టుబడి ఉన్నాం

మత్స్యకార భవన ప్రారంభోత్సవంలో మంత్రి పేర్ని నాని
విజయవాడ,అక్టోబర్‌8 (జనంసాక్షి) : మత్స్యకారుల అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి పేర్ని నాని అన్నారు. గన్నవరంలో 30 లక్షల వ్యయంతో నిర్మించిన మత్స్య సహకార నూతన భవనాన్ని ప్రారంభించిన మంత్రి పేర్ని నాని, ఎమ్మెల్యే వల్లభనేని వంశీ శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, ఎస్సీ, ఎస్టీ, బీసీల సంక్షేమానికి సీఎం వైఎస్‌ జగన్‌ కృషి చేస్తున్నారన్నారు. గుజరాత్‌లో డ్రగ్స్‌ కేసుల్ని ఏపీకి అంటగట్టేందుకు కొందరు ప్రయత్నిస్తున్నారన్నారు. దసరాకు 4వేల ప్రత్యేక బస్సులను నడుపుతున్నామని మంత్రి వెల్లడిరచారు. అధిక ధరలు వసూలు చేసే ప్రైవేట్‌ బస్సులపై చర్యలు తప్పవని మంత్రి హెచ్చరించారు. ఫిర్యాదుల కోసం త్వరలో ప్రత్యేక వాట్సాప్‌
నెంబర్‌ అందుటులోకి తీసుకువస్తామన్నారు. ఆన్‌ లైన్‌ టిక్కెట్‌లపై ఎప్పటికప్పుడు ప్రత్యేక నిఘా పెట్టామని మంత్రి పేర్ని నాని తెలిపారు.