మత్స్యకారుల అభివృద్ధికి ప్రభుత్వం కృషి.

దౌల్తాబాద్ అక్టోబర్ 21, జనం సాక్షి.
మత్స్యకారుల సంక్షేమానికి ప్రభుత్వం కృషి చేస్తుందని ఎంపీపీ గంగాధరి సంధ్యా రవీందర్ అన్నారు. శుక్రవారం సూరంపల్లి గ్రామ చెరువు లో రాష్ట్ర ప్రభుత్వం, మత్స్య శాఖ అందిస్తున్న ఉచిత చేప పిల్లలను ఆమె మత్స్యశాఖ అధికారులు,ముదిరాజ్ సంఘం నాయకులతో కలిసి వదిలారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ముదిరాజుల జీవనోపాధి మెరుగుపరచడానికి ప్రభుత్వం కృషి చేస్తుందని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ బొల్లం స్వామి,ముదిరాజ్ సంఘం సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
Attachments area